ఏపీ గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..తాయిలాల కోసం ఆశపడి అధికార టీడీపీ పార్టీలోకి దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ..ముగ్గురు ఎంపీలు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిన సంగతి విదితమే.అయితే తాజాగా టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలలో నలుగురు బ్యాక్ టూ హోమ్ అంటున్నారు
రాజకీయ వర్గాలు .అసలు విషయానికి వస్తే పార్టీ మారితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని అందినకాడికి దోచుకోవచ్చు..వెనకేసుకోవచ్చు అని నమ్మించి పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ శ్రేణులు పార్టీలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం సంగతి పక్కన పెడితే ప్రజలకిచ్చిన హామీలను సైతం నేరవేర్చేవిధంగా సహకరించడంలేదు స్థానిక టీడీపీ కార్యకర్త నుండి నియోజక వర్గ ఇంచార్జ్ వరకు.
ఇది చదవండిఃఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిగ్ షాక్-బీజేపీలోకి ఎంపీ..!
ఈ క్రమంలో రాష్ట్రంలో కర్నూలు నుండి వైసీపీ చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఒకరు,ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ,తూర్పు గోదావరి జిల్లా నుండి ఒకరు వైసీపీలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు అంట .నియోజకవర్గంలో పేరుకు ఎమ్మెల్యే అయిన కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ అధికారక కార్యక్రమాల్లో కానీ ఇంచార్జ్ మంత్రులు ,నియోజకవర్గ ఇంచార్జ్ లు మాత్రమే పాల్గొంటూ ఎమ్మెల్యేను పక్కన పెట్టేస్తున్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో డెబ్బై శాతమందికి సీట్లు ఇవ్వను అని చంద్రబాబు తేల్చి చెప్పడంతో వైసీపీ నుండి చేరిన వీళ్ళు పార్టీలో ఉన్న ఏమి లాభం లేకపోవడమే కాకుండా తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజల ఋణం తీర్చుకోలేని పరిస్థితి ఉండటంతో పార్టీ మారడమే మంచిదని వారు ఒక అభిప్రాయానికి వచ్చారని ఈ విషయం గురించి బాబు ఆస్థాన మీడియాగా ముద్ర పడిన యెల్లో మీడియా ఏకంగా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఇది చదవండిఃఈ అమ్మాయిలు ఫోన్ లో ఏం చూస్తున్నారు. ..వారి కళ్లలో ఆనందం..మీకు తెలుసా..
ఈ కథనంలో ఇప్పటికే ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత అంతరంగికుడిగా పేరుగాంచిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ,ఎంపీ విజయసాయి రెడ్డిను కూడా సంప్రదించడం జరిగిందంట.ఈ భేటీలో జగన్ ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేశారు అంట .అయితే ఎట్లా అయిన సరే ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా కానీ పార్టీలో ఉంటామని..తమ స్థానాల్లో నిలబెట్టే అభ్యర్థుల విజయానికి మా వంతు కృషి చేస్తామని ..కావాలంటే బాబు తమను ఏవిధంగా ప్రలోభాలకు గురిచేశాడో కూడా వివరిస్తామని విజయసాయి రెడ్డికి హామీ ఇచ్చారు .చూడాలి మరి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇసాడో లేదో..!