ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు అని వార్తలు వస్తోన్నాయి.అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పాటు కేంద్రంలోని పెద్దలను కల్సి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి..తగిన న్యాయం చేయాలనీ కోరనున్నట్లు తన ఆస్థాన మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు.అయితే తాజాగా రాష్ట్రంలో గత కొంతకాలంగా ఒకపక్క ఏపీ ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతుంటే మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ శ్రేణులు గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలుగోడి ఆత్మగౌరవం చాటే విధంగా ధర్నాలు ..రాస్తోరోకులు చేస్తున్నారు.
ఈ తరుణంలో కేంద్రం నుండి టీడీపీ ,రాష్ట్ర ప్రభుత్వం నుండి బీజేపీ పార్టీలు బయటకు వచ్చాయి.దీంతో ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలుచేసుకుంటున్నారు.ఇట్లాంటి సమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారుకు ఏపీ ప్రజలకు న్యాయం చేయడానికి ఏవిధంగా ఎప్పుడు ఎన్ని నిధులు కేటాయించామనే పలు అంశాలతో కూడిన లేఖను విడుదల చేస్తూ.ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు చెప్పాలంటూ ఒక లేఖను విడుదల చేశారు.
దీంతో ఎక్కడ అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత నాలుగు ఏండ్లుగా దోచుకుతింటున్నరో..ఎన్ని లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారో పూర్తీ వివరాలతో అమిత్ షా దగ్గర ఆధారాలున్నాయి.ఇప్పుడు ఒకవేళ ఆయన తోక జాడిస్తే ఎక్కడ సీబీఐ కేసులు ,కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అని భయపడి కేంద్రంలో ఉన్న పెద్దలందర్ని కల్సి లాలుచి పడాలని ఢిల్లీ వెళ్ళుతున్నారు.అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,లేదా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరా రెడ్డిను కానీ లేకపోతే తనకు మిత్రపక్షంగా గత ఎన్నికల్లో ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తీసుకెళ్ళిన నమ్మేవారు కానీ ఇలా వ్యక్తిగతంగా పోవడం వెనక సీబీఐ కేసులు ,కోర్టుల్లో ఉన్న ప్రస్తుత స్టేల గురించి మాట్లాడుకోవడానికి వెళ్ళుతున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి..