వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కేసుల మాఫీ కోసం 2014 ప్రధాని మోడీ కాళ్లను పట్టుకుంటే.. నేడు వైసీపీ ఎంపీలు ప్రధాని కాళ్లు పట్టుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమేనని, ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన వైఎస్ జగన్ మాత్రం తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే అనిత.
see also : రైల్వేశాఖలో మరో 20,000 ఉద్యోగాలు..మొత్తం లక్ష పదివేలు..!
సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే.. అందుకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ హాజరుకాకపోవడాన్ని ఎమ్మెల్యే అనిత తప్పుబట్టారు. దీన్నిబట్టే రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీకి ఎంద చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందన్నారు. ప్రధాని మోడీ ఏ1, ఏ2 ముద్దాయిలకు అపాయింట్మెంట్ ఇవ్వడం కన్నా దారుణమైన విషయం మరొకటి లేదని ఎద్దేవ చేశారు. విజయ సాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిలా కాకుండా, ఒక గజదొంగలా మీడియా ముందు మాట్లాడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే అనిత.