వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతోపాటు, దేశ రాజకీయ నాయకుల నోళ్లలో నానుతున్న పేరు ఇది. వైస్ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలకు మరింత దగ్గరైన వ్యక్తుల్లో ఒకరంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం చేశారనేది వారి అభిప్రాయం. ఇంతలా రాజకీయ విశ్లేషకులు జగన్ గురించి చెప్పడానికి కారణాలు లేకపోలేదు. అందుకు కారణం, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రే. వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రతీ ఒక్కరిని పలుకరిస్తూ, సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తున్నారు వైఎస్ జగన్. దీంతో వైఎస్ జగన్‌కు ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతోందని, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమనే సంకేతాలను ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
స్పీకర్ కోడెలకు కోలుకోలేని దెబ్బ..
ఇదిలా ఉండగా, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న వివిధ పార్టీల నేతలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో జగన్ పార్టీలోకి భారీగానే వలసలు జరిగాయి. అయితే, ప్రస్తుతం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ ప్రాంతం టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, మంగళవారం వైఎస్ జగన్ సమక్షంలో సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ నిమ్మకాయల ఆదినారాయణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో, అందులోనూ ఇప్పటి వరకు విడుదలైన రాజకీయ సర్వేలన్నింటిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపడంతో వివిధ పార్టీల నేతల చూపు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైపు మళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నది రాజకీయ నాయకుల అభిప్రాయం. ఏదేమైనా త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లోపు వైసీపీలోకి మరిన్ని చేరకలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.