వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కాదు అక్కడ ఉన్నవారనందర్నీ కన్నీళ్లు పెట్టించిన సంఘటన ఇది .కనీసం లోకం అంటే ఏమిటో తెలియని వయస్సులోనే అనేక సమస్యలతో సతమతమయ్యే చిన్నారి గుంటూరు లో పాదయాత్ర చేసున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలిసింది.
ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లి అయిన మాదలకు చెందిన శెట్టి వెంకటలక్ష్మి జగన్ తో మాట్లాడుతూ అయ్యా పుట్టడంతోనే నా బిడ్డకు రెండు చేతులకు ఉన్న వేళ్ళు చిన్నవిగా ఉన్నాయి.దీంతో రెండు చేతులు సరిగ్గా పని చేయవు.రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగిన కానీ నా బిడ్డను బాగుచేయలేము అని చేతులెత్తేశారు.నాబిడ్డకు మెరుగైన చికిత్స అందించాలి అని జగన్ తో వేడుకున్నారు..అంతే తనను కదిలించిన ఈ సంఘటనతో కన్నీళ్లు పెట్టుకోవడమే ఒక్కటే మిగిలింది.
వెంటనే నియోజక వర్గ ఇంచార్జ్ వైసీపీ నేతతో మాట్లాడి పాపకు మన తరపున చికిత్స అందించాలని ..ఆ తర్వాత అన్ని రకాలుగా ఆర్థికంగా సాయం చేయాలనీ జగన్ సూచించారు.దీంతో ఆ పాప తల్లి దేవుడే దిగొచ్చి మీరూపంలో మా బాధలను తీర్చడంటూ దండం పెట్టబోయే సరికి రానున్న కాలంలో మన ప్రభుత్వం వస్తుంది .వెయ్యి రూపాయల నుండి ప్రతిదాన్ని ఆరోగ్య శ్రీలో చేరుస్తా అని అప్పుడు మీలాంటి వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు ..