ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సినీ నటి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఏపీ రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాది, ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత నాది, నన్ను నమ్మండి, ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తా, అంతేకాదు, రైతులకు సంబంధించిన, డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలన్నింటిని మాఫీ చేస్తానంటూ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు తీరా అధికారం చేపట్టిన తరువాత తాను ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదంటూ ఏపీ ప్రజలు పెదవి విరిచిన విషయం తెలిసిందే.
see also :
ట్రెండ్ సెట్ చేస్తున్న “నీదీ..నాదీ..ఒకటే కథ “మూవీ ..!
చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ప్రత్యేక హోదా విషయంలోనూ ఉపయోగించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా..? కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానంటే హోదా కావాలంటారా..? కోడలు మగ బిడ్డను కంటానంటే.. అత్త వద్దంటాదా..? అంటూ ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇలా ప్రత్యేక హోదాపై మాట్లాడుతుండగా తీసిన వీడియో క్లిప్పిగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
see also :
ప్రజాసంకల్ప యాత్రపై హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఈ నేపథ్యంలో చంద్రబాబుపై సినీ నటి కవిత చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో ఆందోళనను నెలకొల్పాయి. ఇప్పటి వరకు ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి బహిర్గతంగా అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ, టీడీపీ వర్గాలు మాత్రం వాటిని ఖండిస్తూ వచ్చాయి. అయితే, సినీ నటి కవిత చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంపై అవలంభిస్తున్న వైఖరి ప్రస్పుటంగా బహిర్గతమైంది. ఇటీవల కాలంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో ప్రత్యేక హోదా అంశంపై ఎవ్వరూ నోరు మెదపొద్దని చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేసింది.