ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినాయకత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.ఈ రోజు సోమవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ ఇచ్చిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పార్టీ ఎంపీలతో ,సీనియర్ నేతలతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కల్సి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు కేంద్ర సర్కారు మీద ఇంకా తీవ్రంగా పోరాటాలు ..ఉద్యమాలు చేయాలని సూచించారు.
ముందుగా అనుకున్నట్లు ఏప్రిల్ ఆరో తారీఖున తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయాలనీ నిర్ణయించిన కానీ ఒకవేళ కేంద్రం పార్లమెంటు సమావేశాలను వాయిదా వేస్తె వాయిదా వేసిన రోజే ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలనీ జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు.ప్రత్యేక హోదా కోసం గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి విదితమే ..