ఏపీలో టీడీపీ నేతల అవినీతి రోజుకో వింత రూపం దాల్చుకుంటుంది.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా గాలి నిప్పు నీరు నింగి కాదేది అవినీతి చేయడానికి అన్నట్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఇంటికి బాత్రూం అనే స్కీమ్ ను కూడా అవినీతి చేయడానికి రాష్ట్రంలో ఉన్న అధికార టీడీపీ నేతలు వినియోగించుకున్నారు.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో ఇప్పటివరకు టీడీపీ సర్కారు ముప్పై మూడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై బాత్రూమ్ లను కట్టించింది.
ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కోదానికి పన్నెండు వేల రూపాయలను అర్హులకు అందజేస్తుంది.అయితే అధికార పార్టీ నేతలు మీరు బాత్రూం కట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు మూడు వేల నుండి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని స్థానికులకు హూకుం జారిచేశారు.ఒకవైపు అధికార పార్టీ నేతలు ..మరోవైపు బాత్రూం కట్ట్టుకోవాలనే ఆరాటం వెరసి అర్హులు మూడు వేల నుండి ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు.అంటే ఈ వంతున అధికార పార్టీ నేతలు బిల్లుల్లో ఇరవై శాతం తీసుకున్నారు అనుకున్న మొత్తం కట్టినవాటిలో పాతిక శాతం అంటే దాదాపు తొమ్మిది వందల తొంబై ఎనిమిది కోట్ల రూపాయలను తిన్నారు.
అయితే రాష్ట్ర అసెంబ్లీ విజిలెన్స్ కమిటీ రిపోర్టులో రాష్ట్రంలో కృష్ణ జిల్లా అవనిగడ్డ, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లో అసలు బాత్రూం లు కట్టకుండానే దొంగ బిల్లులు పెట్టి నేతలు తినేశారు అని తేల్చేశారు. దాదాపు 27మండలాల్లో ఒక్క లెట్రిన్ కూడా కట్టకుండా బిల్లులు డ్రా చేసేసారు అందులో ఒక్కో దానిలో 7కోట్ల వరకు అవినీతి జరిగిందని తేలింది.ఈ విధంగా అఖరికీ బాత్రూమ్ లను కూడా వదలకుండా టీడీపీ సర్కారు ..వెయ్యి కోట్ల స్కాము చేసిందన్నమాట..అయితే కింది అటాచ్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు నుండి సేకరించింది.గమనించగలరు ఏపీలో అవినీతి ఏ విధంగా జరుగుతుందో ..!