గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెను కలకలం రేపుతున్నాయి. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉందని పేర్కొంది. తెలుగు అమ్మాయిలు దానికి అంగీకరించడం లేదనే అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలపై మరో నటి సత్య ఆగ్రహం వ్యక్తం చేసారు. పడుకోవడం అంటే ఏమిటి… అలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతా అంటూ మండిపడింది. ఆమె మాటల్లోనే… ” నాకు శ్రీరెడ్డి ఎవరో తెలీదు. ఆమె మాటలు చూస్తుంటే నైట్ నైట్ స్టార్‌డం తెచ్చుకోవాలనిపిస్తున్నట్లుంది. రెండ్రోజుల నుంచి చూస్తున్నా. ప్రతి ఆర్టిస్టు కూడా ఆమె మాటలకు మండిపడుతున్నారు. అసలు పడుకోవడం ఏంటండీ.. ఆమె అసలు ఆడదేనా? బాధ వుంటే చెప్పమ్మా. నువ్వెళ్లే రూట్ మాత్రం కరెక్ట్ కాదు. ప్రతి ఆర్టిస్టు పడుకోవాల్సిందే అంటున్నావు నువ్వేమైనా పక్కనుండి చూశావా. ఆ మాటలకు చెప్పు తీసుకుని కొట్టాలి. నోటి దూల వుందా తీర్చుకో. మరేదో వుందా తీర్చుకో. దర్శకుడు, నిర్మాతల గురించి చెడ్డగా మాట్లాడకు. నీ డ్రెస్ సెన్స్ గురించి నువ్వు చూస్కుంటున్నావా. తెలుగు ఇండస్ట్రీకి నువ్వు చెప్పినట్లు ఆ ఖర్మేమీ పట్టలేదు. ఎవడో మోసం చేశాడని అందరినీ అంటావా, చెంపలు పగులకొడతా. ఇష్టం లేకపోతే పట్టుకెళ్లిపోయి రేప్ చేసేవాళ్లయితే లేరు. ఆంధ్రలో కొట్టుకు చస్తున్నారు ప్రత్యేక హోదా కోసం… వెళ్లి పోరాడు” అంటూ సత్య వ్యాఖ్యానించారు.
