సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ.. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లకు సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించారు. కాగా, శుక్రవారం ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు పోసాని కృష్ణ మురళీ ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజనా చౌదరికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీటు ఇవ్వడానికి గల కారణాలు, అలాగే ప్రధాని మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలతోపాటు, నారా లోకేష్‌లకు సుజనా చౌదరికి మధ్య గల సంబంధాలను ఆధారాలతో సహా బయటపెట్టారు పోసాని కృష్ణ మురళీ.
see also : మహిళా లోకాన్ని తీవ్రంగా అవమానిస్తున్న ఆస్థాన మీడియా-మహిళా సంఘాలు ఎక్కడ ..!
అయితే, మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో సుజనా చౌదరి నారా లోకేష్‌కు అమ్మాయిలను సరఫరా చేసేవాడని, ఆ బంధమే ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. నారా లోకేష్‌తో సుజనా చౌదరికి ఉన్న పరిచయాలే సుజనా చౌదరిని రాజ్యసభ సభ్యుడ్ని చేశాయని బల్లగుద్ది మరీ చెప్పారు పోసాని కృష్ణ మురళీ. వారిద్దరి మధ్య సంబంధం తెలియాలంటే.. నాతోపాటు అమెరికా వస్తే మీకు కావాల్సినన్ని ఆధారాలు, వీడియోలు ఇస్తానంటూ మీడియా సాక్షిగా చెప్పారు పోసాని కృష్ణ మురళీ. అటువంటి సుజనా చౌదరికి రాజ్యసభ సీటు ఇప్పిస్తారా..?? అంటూ మీడియా ముఖంగా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. అందులోనూ ఏపీలో ఉన్న అతి పెద్ద ఆర్థిక నేరగాళల్లో సుజనా చౌదరి ఒకరు. సుజనా చౌదరిపై ఉన్న ఆర్థిక నేరాలన్నీ కూడా రుజువైనవన్న వాస్తవం అందరికి తెలిసిన విషయమే. అటువంటి ఆర్థిక నేరగాడ్ని చంద్రబాబు తన పక్కన కూర్చోబెట్టుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇలా తన చుట్టూ ఆర్థిక నేరగాళ్లను కూర్చోబెట్టుకుంటున్నారు కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఇచ్చేందుకు భయపడుతున్నారన్నారు పోసాని కృష్ణ మురళీ.