ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడితే మక్కెలిరగ్గొడతారా..?, మీరు ప్రజలు మక్కెలిరగ్గొడితే.. ప్రజలు మీ తాట తీస్తారు..!! అంటూ చంద్రబాబు సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకులు, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అయితే, ఇటీవల కాలంలో ఏపీ సర్కార్‌కు, తెలుగు సినీ ఇండస్ర్టీ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండస్ర్టీ ప్రముఖులు ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ఏసీ రూముల్లో హీరోయిన్లతో కులుకుతున్నారని, ప్రజలు ఇచ్చిన డబ్బులతో బతుకుతూ.. ప్రజల కోసం పోరాటం చేసేందుకు టాలీవుడ్ రావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ.. ముఖ్యమంత్రిగా పదవి అనుభవిస్తున్న మీ చంద్రబాబు ఏమన్నా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారా..? అంటూ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు.
see also : చంద్రబాబు రూ.1,667 కోట్ల అవినీతి భాగోతం బట్టబయలు..!!
ఇదిలా ఉండగా, ఇటీవల చంద్రబాబు సర్కార్‌కు చెందిన ఓ స్పెషల్ రిప్రజెంటేటివ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ మెసేజ్ వైరల్ అయింది. ఆ మెసేజ్‌లో చలసాని శ్రీనివాస్‌ను బెదిరిస్తూ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇకపై ఎవరైనా ప్రత్యేక హోదాపై పోరాడితే మక్కెలు ఇరగ్గొడతామని, పోరాటాలు, ఉద్యమాలు అంటూ సమయం వృధా చేసుకోకుండా ఎవరి పనులు వారు చూసుకోవాలనేది ఆ మెసేజ్ సారాంశం. దీనిపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియకుండానే ఈ వ్యాఖ్యలు చేశారా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. నాడు ప్రత్యేక హోదా కోసం పోరాడితే జైలు శిక్ష అన్నావ్..!! ఇప్పుడేమో మక్కెలిరగ్గొడతానంటున్నావ్..!! ఇలా ఊసరవెల్లిలా రంగులు మారిస్తే ప్రజలు నీ తాట తీస్తారంటూ సమాధానం ఇచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.
see also :
సుజనా చౌదరి, లోకేష్‌ల రాసలీల భాగోతం బట్టబయలు..!!