అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ కి చెందిన పి శంకర్ రావు ,టీడీపీ పార్టీకి చెందిన దివంగత మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ సాయంతో కేంద్ర మంత్రి పి చిదంబరం నాయకత్వంలో పలు అక్రమ కేసులు
బనాయించిన సంగతి తెల్సిందే.అయితే ఆ తర్వాత పి శంకర్ రావు రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయాడు.కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం సీబీఐ కేసులను ఎదుర్కుంటున్నాడు.తాజాగా అప్పటి సీబీఐ జేడీ ,జగన్ పై అక్రమ కేసులను బనయించగానే ఇతర రాష్ట్రాల నుండి సిబ్బందిను తీసుకొచ్చి మరి విచారణ చేయించిన సీనియర్ ఐపీఎస్ అధికారి,మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ వాలంటరీ రిటైర్మెంట్ కు దరఖాస్తు చేసుకున్నారు.
అందుకు మహారాష్ట్ర డీజీపీ కి లేఖ రాశారు.దీనిపై సోషల్ మీడియాలో సీనియర్ జర్నలిస్టు ఇలపావులూరి మురళీ మోహన రావు గారు పెట్టిన ఒక పోస్టు వైరల్ అవుతుంది.ఉన్నదీ ఉన్నట్లు మీకోసం ..”తలవంచుకుని వెళ్లిపోయిన లక్ష్మీనారాయణ @@@చంద్రబాబు అక్రమాలమీద, కుంభకోణాలమీద విచారణలు జరపమని న్యాయస్థానం ఆదేశిస్తే సిబ్బంది లేరు అని చెప్పి తప్పించుకుని, జగన్ ఆస్తులమీదవిచారణ చెయ్యమనగానే దేశం నలుమూలలనుంచి సిబ్బందిని తెప్పించుకుని జగన్ మీద
అనేక అక్రమ కేసులను బనాయించి, జైలులో కూర్చోబెట్టి, న్యాయంగా రావాల్సిన బెయిల్ కూడా రాకుండా పదహారు నెలలపాటు అడ్డుకుని, తన సాటి ఉన్నతాధికారులమీద అవినీతి కేసులను మోపి జైళ్లలో పడేయించి వారి జీవితాలతో ఆడుకుని, చివరకు ఒక్క కేసు కూడా నిరూపించలేక, అసమర్ధుడుగా ముద్రవేయించుకుని, ముంబై కి బదిలీ చెయ్యబడి, అక్కడ ప్రభుత్వం ఈయనగారి అతిని గ్రహించి పోస్టింగ్ ఇవ్వకుండా తొమ్మిది నెలలపాటు మూల కూర్చోబెడితే కూర్చుని అక్కడ కూడా ఏమీ చేయలేక చివరకు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నిష్క్రమించాడు వీవీ లక్ష్మీనారాయణ.
ఐపీఎస్.చంద్రబాబు ఏజెంట్ గా, జగన్ ను శాశ్వతంగా జైల్లో ఉంచడమే లక్ష్యంగా పనిచేసిన లక్ష్మీనారాయణ సిబిఐ వ్యవస్థను సర్వనాశనం చేసి, అత్యంత అసమర్థుడైన అధికారిగా ఛీత్కరించబడ్డాడు. లక్ష కోట్లు అని ఆరోపణలు మొదలు పెట్టి, చివరకు ఒక్కశాతం కూడా ఉందని రుజువు చెయ్యలేక పరువు పోగొట్టుకున్నాడు. పత్రికలతో విపరీతంగా ఒక హీరోగా ప్రచారం చేయించుకుని, వివేకానందుడు, బుద్ధుడు లాంటి విశేషణాలు తగిలించుకుని, పొగడ్తలకు పొంగిపోతూ, కటౌట్లు పెట్టించుకుని, యువతకు సందేశాలు ఇస్తూ తానేదో గొప్ప సంస్కరణవాదిని అనే బిల్డప్ ఇప్పించుకుని ఐపీఎస్ వ్యవస్థకు కళంకం తెచ్చాడు.ఈయనకు రాజ్యసభకు వెళ్లాలని ఉన్నదట. ఎవరు ఆఫర్ ఇచ్చారో మరి! ఒకవేళ జగన్ ను జైలుకు పంపించి ఉన్నట్లయితే బహుశా చంద్రబాబే ఆయనను తెలుగుదేశం తరపున రాజ్యసభకు పంపించి ఉండేవాడు…
కనకమేడల స్థానంలో.నా ఊహ నిజమే అయితే…జగన్ కేసులు త్వరలో కొట్టివేయబడతాయి. లక్ష్మీనారాయణకు కోర్టు బాగా తలంటే అవకాశం ఉన్నది. అంతేకాక రాబోయే ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. జగన్ గనుక కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటె లక్ష్మీనారాయణ పరిస్థితి ఘోరంగా మారిపోతుంది. ఆ అవమానాలు తప్పించుకునే ఉద్ద్యేశ్యంతోనే లక్షీనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉండవచ్చు.”దేవుడు చూస్తున్నాడు” అని పదేపదే జగన్ చెప్పేమాట నిజమేనేమో?..అని పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది ..