ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికల తరువాత టీడీపీ అధికారంలోకి రాగనే.. ప్రతి పక్ష అయిన వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఏంపీలు తెలుగదేశంలోకి భారీగా వలస వచ్చారు. మొట్టమొదటగా వలసలు స్టాట్ చేసింది కర్నూల్ జిల్లాలోనే. నంద్యాల పార్లమెంట్ సభ్యులు యస్ పి.వై.రెడ్డి వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి చేరారు. తరువాత ఒక్కొక్కరుగా ఇప్పటి వరకు 22 మంది టీడీపీ లో చేరారు. కాని ఏపీ ప్రజలకు తెలుగదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి కూడ ఎన్నికల ముందు ఇచ్చిన 600 హమీల్లో ఒక్కటి కూడ నెరవెర్చలేకపోయారు. గత 4 సంవత్సరాలనుండి టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం అని తెలిసి ఇక వలసలు ఆగినట్లు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ నుండి వైసీపీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. ప్రత్యేక హదా వద్దని ప్యాకేజీయే ముద్దని ఇప్పటి వరకు ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన టీడీపీ.. ఎన్నికల దగ్గరపడటంతో సడన్ గా యూటర్న్ తీసుకుంది.
See also..ఏపీ టీడీపీ సర్కారు మీద సీబీఐ విచారణ ..!
ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమేనని భావించి..ఒక్కొక్కరిగా పార్టీని వీడేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తరువాత ఏ జిల్లా నుండి అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడం మొదలు పెట్టారో అదే జిల్లాకు చెందిన బనగానపల్లి టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఈ వరుసలో ముందున్నారు. ఆయన ఇప్పటికే వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేస్తే.. గెలిచే పరిస్థితి లేదని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారని సమాచారం. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డి ఎలాగైనా తన సోదరుడు రాజా రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో దింపేందుకు సీఎం చంద్రబాబు దగ్గర తీవ్ర ప్రయత్నాలు చేశారు..కాని తమ్ముడుకి టిక్కెట్ ఇవ్వలేదని తెలిసి..మరోక నాయకుడు మాజీ ఎమ్మెల్యే చల్లా రామక్రిష్ణారెడ్డికి ఇవ్వమని అడిగాంట..అయిన ఆయన సూచించిన నాయకులను కాదని, ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆయన ముఖాభావంగా ఉన్నారట.
see also..
ఎల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్..! ఒక్కో షేర్‌తో.. ఒక్కో చెప్పుదెబ్బ..!!
అంతేగాక గత ఎన్నికల్లో జనార్దన్ రెడ్డిపై వైసీపీ తరుపున పోటీచేసి ఓడిపోయిన కాటసాని రామిరెడ్డి టీడీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారట. నంద్యాల ఉప ఎన్నికల్లో తన అల్లుడు భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపునకు రామిరెడ్డి బలంగా పనిచేశారు. దీంతో రామిరెడ్డి వల్లే తను ఓడిపోయానని శిల్పా మోహన్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. ఎలాగైనా.. బీసీ జానార్దన్ రెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు శిల్పామోహన్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే జనార్దన్ రెడ్డి జగన్ తో చర్చలు జరిపారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తన కార్యకర్తలతో చర్చలు జరిపి త్వరలో వైసీపీలో చేరికపై జనార్దన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉందని సమచారం.