జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి అని ఆయన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలిపారు.
అయితే ఈ వ్యాఖ్యలపై నారా లోకేష్ నాయుడు స్పందిస్తూ తనపై ,తన తండ్రిపై ఆరోపణలు చేయడం చాలా
బాధాకరం.ఇలాంటి ఆరోపణలు చేస్తాడని అసలు అనుకోలేదు.తనపై అవినీతి ఆరోపణలకు ఆధారాలు ఉంటె నా ఫోన్ నెంబర్ ఉంది కదా సంప్రదించవచ్చు కదాని ఆయన అన్నారు .
దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబుతో సహా ఆ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి.అవి తొందర్లోనే బయటపెడతా అని ఆయన ప్రకటించేశారు.