ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పదహారు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ యాత్రలో భాగంగా జగన్ గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో జరిగిన భారీ బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ అన్యాయమైన రాజు
అనే కథ చెప్పి బాబు నిజస్వరూపం బయటపెట్టాడు .జగన్ మాట్లాడుతూ “అనగనగా అన్యాయమైన రాజుండేవాడు .ఆయన నిత్యం అన్యాయమైన పాలనను చేస్తూ ప్రజలను పలు కష్టాలకు గురిచేస్తూ ..దోచుకుంటూ ..పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజలకు నరకం చూపించేవాడు.
అయితే ఆ రాజుకు ఒకసారి దేవతా వస్త్రాలను ధరించాలనే కోరిక పుట్టింది.అందుకు చేనేతన్నలను పిలిపించి తనకు తగిన విధంగా వస్తువులను తయారుచేయాలని ఆర్డర్ ఇచ్చాడు.అయితే అప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఆ రాజుకు బుద్ధి చెప్పాలని చేనేతన్నలు రాజుతో మాకు మూడు నెలల సమయం ఇవ్వండి.అప్పుడు దేవతా వస్త్రాలను తీసుకొస్తాం అని అన్నరు.ఆ తర్వాత పెద్ద పెట్టెలు తీసుకొచ్చి రాజు గారి ఆస్థానానికి వెళ్లారు.పెట్టెలో దేవత వస్త్రాలు ఉన్నాయని ..అయితే మేము తెచ్చిన వస్త్రాలు మూర్ఖులకు కన్పించవు ..కేవలం మంచి వారికి మాత్రమే కనిపిస్తాయి అని చెప్పారు .
దీంతో వారు రాజుకు ఉన్న బట్టలు విప్పి ..తాము తెచ్చిన వాటిని ధరింపచేశారు.అలా కడుతూ వారు ఈ బంగారు పూవు బాగుంది కదా అని అన్నారు .దీంతో రాజు కూడా తనకు ఏమి కన్పించకపోయినా అక్కడ బట్టలు లేవు అని సంగతి తెల్సిన కూడా ఎక్కడ తనని మూర్ఖుడని ప్రజలు అనుకుంటారో అని అవును అని అన్నారు.అట్నే నిండు సభలోకి వచ్చారు.సభలో తన వారంతా (యెల్లో మీడియా )అహో ఓహో అంటూ తెగ కీర్తించాయి .
మీ బట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పడంతో ఆ రాజు బయటకు ఊరిగెంపుగా ఏనుగుల మీద బయలుదేరారు.అయితే బట్టలు లేని రాజును చూసి ఒకతను అయ్యో మీ రాజుకు బట్టలు లేవు కదా .ఎనుగులపై బట్టలు లేకుండా ఊరేగుతుండటం సిగ్గు సిగ్గు అని అనసాగాడు ..ఇలా యెల్లో మీడియా వలన బాబు ఏమి చేసిన చేయకపోయినా కానీ తానా అని బట్టలు లేకుండా నడి బజారున నిలబెడుతున్నారు అని జగన్ ఆరోపించాడు
..