ఏపీ అధికార పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక అంశం మీద సొంత సర్వేలు చేయించుకోవడం అలవాటు అనే సంగతి తెల్సిందే.గత నాలుగు ఏండ్లుగా తమ పాలనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారు అని ..అంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు ..ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించడం కష్టమే అని గతంలో చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు కూడా.తాజా రాజకీయ పరిస్థితులపై ,సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు నాయుడు సొంత సర్వే చేయించాడు అంట.అయితే ఈ సర్వేలో బాబుకే దిమ్మతిరిగి బొమ్మ కనపడే ఫలితాలు వచ్చాయి అంట.దీంతో ఏమి చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాడు అంట .
See Also:ప్రత్యేక హోదాపై జగన్ పోరాటం అద్భుతం :చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!!
ఈ సర్వేలో దాదాపు తొమ్మిది ఏళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉడటం మూలంగా ఆ పార్టీకి చెందిన నేతలు ఆర్థికంగా ఎంతగానో చితికిపోయామని ..వచ్చే ఎన్నికల్లో గెలుపు సంగతి పక్కన పెడితే ముందు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే లక్ష్యంతో అందినకాడికి దోచుకుంటున్నాము..అందుకే టీడీపీ ప్రభుత్వం చేపట్టిన నీరు మీరు కార్యక్రమం నుండి రాజధాని నిర్మాణం వరకు అన్ని పథకాల్లో కమీషన్లను తీసుకోవడమే కాకుండా ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ అభివృద్ధి పేరిట లాక్కోవడం ..సెజ్ ల పేరు మీద పంటలు పండే పంటలు అని కూడా చూడకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూములను తీసుకోవడం …వాటిని తమ బీనామీల పేరిట గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయించడం ఇలా పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని తేలింది.
అంతే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోసం బాబు కురిపించిన ఆరు వందల హామీలలో ఏ ఒక్కటి నేరవేర్చకపోవడమే కాకుండా విభజన చట్టంలోని హామీలను సైతం బాబు తుంగలో తొక్కడంతో ప్రజల్లో క్షేత్రస్థాయి నుండి తీవ్ర వ్యతిరేకత ఉందని ..దీని ప్రభావంతో రానున్న ఎన్నికల్లో గెలుపు సంగతి అటుంచితే అసలు ఉన్న ఎమ్మెల్యేలలోనే సగం కంటే ఎక్కువమంది ఓడిపోతారని తేలింది అంట .అంతే కాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే వైసీపీ వైపు యాబై ఐదు శాతం మంది ..టీడీపీ వైపు నలబై శాతం మంది ..బీజేపీ వైపు ఐదు శాతం మంది మొగ్గు చూపుతారని కూడా ఈ సర్వేలో తేలడంతో బాబుకు నిద్ర పట్టడంలేదు అంట.అయితే ఓడిపోయే ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు ఇలా ఉన్నారు అంట ..
See Also:ఆ ముగ్గురు YSRCP ఫిరాయింపు ఎంపీలు బ్యాక్ టూ హోమ్ ..!
వారిలో “శ్రీకాకుళం జిల్లాలో బి అశోక్ (ఇచ్ఛాపురం ),గౌతు శివాజీ (పలాస ),కే అచ్చన్నాయుడు (టెక్కలి),కే వెంకటరమణ (పాతపట్నం),గుండా లక్ష్మీ (శ్రీకాకుళం),కూన రవికుమార్(ఆముదాలవలస),కళా వెంకట్రావు(ఎచ్చెర్ల),బొగ్గు రామణమూర్తి (నర్సన్నపేట),కొల్లా లలిత కుమారి(సూర్యవరపుకోట),పీజీవీఆర్ నాయుడు(వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే),సూర్యనాగ సన్యాసి రాజు (చౌడవరం),గోవింద సత్యనారాయణ (అనకాపల్లి),ఆనంద రావు (అమలాపురం),నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (అనపర్తి ),ముప్పిడి వెంకటేశ్వరరావు(గోపాలపురం),మొడియం శ్రీనివాసరావు(పోలవరం),బాదేటి కోటా రామారావు(ఏలూరు),బురుగు పల్లి శేషా రావు(నిడదవోలు),వల్లభనేని వంశీమోహన్ బదులు వేరేవాళ్ళకు సీటు ఇస్తారని ప్రచారం జరగడంతో ఇక్కడ బరిలోకి దిగేవారు (గవన్నవరం),రాజగోపాల్ శ్రీరాం(జగ్గయ్యపేట),అలపాటి రాజేంద్రప్రసాద్(తెనాలి) ,అనగాని సత్యప్రసాద్ (రేపల్లె) ఉన్నారు.
See Also:మోకాళ్లపై నడిచినా.. జగన్ సీఎం కాలేడు..!!
మల్లికార్జున రెడ్డి (రాజంపేట్),జేసీ ప్రభాకర్ రెడ్డి ( తాడిపత్రి),ఎర్రన్న (మడకశిర) ,డీఏ సత్య ప్రభ (చిత్తూర్),ఎం. సుగుణమ్మ (తిరుపతి) ,సూర్యనారాయణ (దర్మవరం),మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ( గుంటూరు ),బండారు మాదవ నాయుడు (నర్సాపురం),భూమా అఖిల ప్రియ(ఆళ్లగడ్డ) ,భూమా బ్రహ్మానందరెడ్డి(నంద్యాల) ,కేఈకృష్ణమూర్తి(పత్తికొండ),మణిగాంధీ(కోడుమూరు) ,అది నారాయణ రెడ్డి(జమ్మలమడుగు),జలీల్ ఖాన్(విజయవాడ వెస్ట్) ,ప్రత్తిపాటి పుల్లారావు(చిలకలూరి పేట) ,గిడ్డి ఈశ్వరీ( పాడేరు) ,మరో ఎమ్మెల్యే జవహర్ వీరితో పాటుగా వైసీపీ నుండి చేరిన మిగత ఎమ్మెల్యేలు కూడా ఇలా ఓడిపోయే వారి జాబితాలో ఉన్నట్లు సర్వేలో తేలడంతో బాబుకు షాక్ కు గురిచేసిందంట ..