ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే, అధికారంలోకి వస్తే సమస్యలను ఎలా పరిష్కరించాలో నిరంతర ఆలోచిస్తున్న వైఎస్ జగన్ అని, అలాంటి ప్రజాదారణ కలిగిన వ్యక్తి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోతే జీవితంలో పంచాంగం చెప్పడం మానేస్తామని 40 మంది పండితులు కంఠాపథంగా చెప్పారు. కాగా, ఆదివారం శ్రీ విళంబి నామ సవంత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని పురష్కరించుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తు గురించి 40 మంది పండితులు పంచాంగం చెప్పిన విషయం తెలిసిందే.
see also : బుల్లితెరకెక్కనున్న చంద్రబాబు అవినీతి భాగోతం..!!
see also : పవన్ రాజకీయంపై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు..!!
ఇక జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధిస్తాడా.. ? లేదా..? అన్న విషయం గురించి పండితులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ఢిల్లీలో పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని, ఇలా వైఎస్ జగన్ నిరంతర పోరాటం ద్వారా ప్రత్యేక హోదా సాధించడం ఖాయమని పండితులు తేల్చి చెప్పారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ 135 మంది ఎమ్మెల్యేలను గెలవడమే కాకుండా, టీడీపీ కంటే ఎక్కువ మంది ఎంపీలను వైసీపీ గెలుస్తుందన్నారు. వైసీపీ ఎక్కువ మంది ఎంపీలను గెలవడంతో, వైఎస్ జగన్ సూచనల మేరకు పార్లమెంట్‌లో ఎంపీల నిత్య పోరాటం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం ఖాయమని పురోహితులు తేల్చి చెప్పారు. ఒకవేళ అలా జరక్కపోతే మేము నలబై మంది పంచాంగం చెప్పడం మానేస్తామని తెలిపారు .చూడాలి మరి పంచాంగం ఎంతవరకు నిజమవుతుందో..!