ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అవినీతి భాగోతం త్వరలో బుల్లితెరకెక్కనుందా..? అందులో చంద్రబాబు పాత్ర, నారా లోకేష్ పాత్రలు ఎవరు పోషిస్తారు. చంద్రబాబు హత్యలు చేయించారంటూ గతంలో వచ్చిన విమర్శలను ఎలా చూపిస్తారు..? నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నిర్మాణంలో జరిగిన అవినీతి ఎంత..? నేడు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు వాటా ఎంత..? విశాఖ భూ కుంభకోణం, నారా లోకేష్, టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి అవినీతిని బుల్లితెరపై చూపిస్తారా..? జగన్‌పై అక్రమ కేసులు బనాయించడంలో చంద్రబాబు పాత్ర ఎంత మేర ఉంది అన్న ప్రశ్నలకు త్వరలో ఓ జాతీయ స్థాయి ఛానెల్లో ప్రసారం కానున్న సీరియల్ సమాధానం చెప్పనుంది.
see also : జగన్ కేసుల గురించి సంచలన విషయాలు చెప్పిన సీబీఐ రిటైర్డ్ ఎస్పీ..!!
అవును, జాతీయ స్థాయి ఛానెల్లో చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేసిన అవినీతి భాగోతాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో గుంటూరులో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ.. నారా లోకేష్, టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డిల అవినీతి భాగోతం అంతా నా వద్ద ఉందని, దాన్ని సమయం వచ్చినప్పుడు బయట పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గత నాలుగేళ్లుగా చంద్రబాబుతో కలిసి ఉన్న తాను.. తండ్రీ, కొడుకుల అవినీతిని చాలా దగ్గరుండి చేశానండూ కుండబద్దలు కొట్టాడు జనసేనాని.
see also : పవన్ రాజకీయంపై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు..!!
మరో పక్క, 2014 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో జతకట్టి, అమలుకాని హామీలు గుప్పించి, తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో మోసపూరిత హామీలతో ప్రజలను నట్టేట ముంచిన విషయం తెలిసిందే. అయితే, 2014లో అధికారం చేపట్టినప్పట్నుంచి ఇప్పటి వరకు నూతన రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు అవినీతి అంతా ఇంతా కాదు. చంద్రబాబు అవినీతిపై ఇటు స్థానికంగా, అటు జాతీయ స్థాయిలోనూ రోజుకో వార్త. 2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ అవినీతి భాగోతాన్నంతా చంద్రబాబు తన మిత్రపక్షమైన బీజేపీపై నెట్టేసే ప్రయత్నాలు ఇటీవల కాలంలో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ విషయాలన్నింటిని గమనించిన ఓ రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు చద్రబాబు అవినీతి భాగోతాన్ని ఓ సీరియల్ రూపంలో బుల్లితెరపై ప్రసారం చేయాలని నిశ్చయించుకున్నాడట.