నవంబర్ 8 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు మూడు నెలలు పట్టింది. అయినా, కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇంతలా దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యులను ఉలిక్కిపడేలా చేసిన ఆ నిర్ణయం అందరికీ తెలిసిందే. అదే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.
see also : బుల్లితెరకెక్కనున్న చంద్రబాబు అవినీతి భాగోతం..!!
see also : ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క జగన్‌కే ఉంది..!!
ఏదేమైనా, ఆ రోజు నుంచి నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలను ఆదుకునేందుకు మేం చేపట్టాల్సిన చర్యలు చేపడుతున్నామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని అన్ని రాష్ట్రాలు మొదట మూడు నెలలు ఇబ్బందులు పడ్డా.. తరువాత కాలంలో నగదు కొరత అంతగా లేదని వార్తలు టీవీ ఛానల్లో ప్రసారమైన విషయం తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెద్ద నోట్ల రద్దు చేసిన నాటి నుంచి నేటి వరకు ప్రజలు నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏపీలోని ఏటీఎంలలో ఇప్పటికీ నో క్యాష్ బోర్డులే కనిపిస్తాయి. బ్యాంకులకు వెళ్తే ఇప్పుడు కాదు, రేపు రండీ.. అంటూ సామాన్యులకు సమాధానాలు వినిపిస్తున్నాయి.
see also : హాట్సాఫ్ హరీష్ రావు..!!
see also : సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..!
ఈ విషయంపై ఇటీవల ఓ సోషల్ మీడియా ప్రచురించిన కథనం ఏపీ ప్రజలను ఖంగుతినేలా చేసింది. ఆ కథనం సారాంశం మీకోసం. పెద్ద
నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఛైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఏపీకి మొదట విడతగా రూ.20వేల కోట్ల నగదు మేర పంపించామని, ఆ తరువాత పలు విడతల్లో మరికొంత నగదును పంపించడం జరిగిందన్నది ఆర్బీఐ సమాచారం. అయితే, దేశంలోని ఏ రాష్ట్రానికి పంపించనన్ని నిధులు ఏపీకి పంపిస్తే.. ఇప్పటికీ ఏపీ ప్రజలు నగదు కొరత ఇబ్బందులను ఎదుర్కోవడం కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే, ఇటీవల ఈ అంశంపైనే ఆర్బీఐ అధికారులు విచారణ చేపట్టారని, ఆర్బీఐ అధికారుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త సారాంశం.
పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఏపీ నుంచి ఎక్కువ మొత్తం తమిళనాడుకు తరలిపోయిందని, ఆ నగదు తమిళనాడులో మకాం వేసిన ఓ బఢా టీడీపీ నేత, టీటీడీ మాజీ సభ్యుడు ఇంట్లో ఉండగా ఏసీబీ, ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేసి పట్టుకున్నారని, అయితే, ఆ సోదాల్లో అధికారులకు చిక్కింది 5 శాతమేనని, మిగతా 95 శాతం టీడీపీ నేత వద్దే భద్రంగా ఉందన్నది సోషల్ మీడియాలో ప్రచురితమైన కథనం సారంశం. అయితే, ఇటీవల కాలంలో గుంటూరు వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలోనూ పవన్ కల్యాన్ ఈ విషయంపైనే మాట్లాడారు. నారా లోకేష్‌కు, తమిళనాడులో మకాం వేసిన ఓ బఢా టీడీపీ నేతతో అవినీతి సంబంధాలు ఉన్నాయంటూ చెప్పి రాజకీయాల్లో పెను సంచలనాన్నే రేపారు. పవన్ కల్యాణ్ ఇలా టీడీపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడంతో సోసల్ మీడియాలో ప్రచురితమైన వార్తకు బలం చేకూరినట్లయింది.