తెలుగు తమ్ముళ్ల వలనో..అ పార్టీ ఎమ్మెల్యేల వలనో లేదా స్థానిక కార్యకర్తల దగ్గరనుండి బడా బడా నాయకుల వరకు చేసే అవీనితి వలన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం అస్సలు కలిసి రావడం లేదు …రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తోలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి ..అమయాకపు ప్రజలను మోసం చేశాడు. ఏపీలో ప్రజల్లో తనపైన ఉన్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నట్టే ఉన్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నో సర్వేలు తేటతెల్లం చేశాయి. ఇప్పుడు తాజాగా మరోసర్వే కూడా అదే విషయాన్ని నిరూపించింది.
see also..
హాట్సాఫ్ హరీష్ రావు..!!
పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్ర ప్రదేశ్ లో 2019లో జరగనున్న ఎన్నికల్లో టీడీపీకి 60 సీట్ల లోపే వస్తాయి. అది కూడా పవన్ కళ్యాణ్ జనసేన, కమ్యూనిస్టులు సీట్లు గెలుచుకోవడంలో విఫలమయితే తెలుగుదేశానికి కనీసం 60 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. అదే టైంలో 100 సీట్లకు పైగా స్థానాలతో భారీ మెజార్టీతో ప్రస్తుతం ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి రావడం ఖాయం అని ఈ సర్వే చెప్పింది. అంతేకాదు ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇదే పరిస్థితి అన్నది సర్వే రిపోర్ట్. చంద్రబాబు, జగన్‌ల ఎన్నికల హామీలను ప్రజలు ఎంత ఎక్కువగా నమ్ముతున్నారు అని కూడా చేసిన సర్వేలో చంద్రబాబుని నమ్మేవాళ్ళ శాతం 20 శాతం కంటే లోపే ఉంది. అదే వైఎస్ జగన్ విషయంలో మాత్రం 60శాతం పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తామని చెప్పారు. ఏ రకంగా చూస్తే ఎన్నికల హామీలతో ఏవైనా స్టంట్స్ చేసి, అబద్ధపు ప్రచారంతో గెలిచే అవకాశం కూడా చంద్రబాబుకు తక్కువే. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అత్యంత దారుణంగా ఓడిపోవడం ఖాయమని జాతీయ స్థాయి సీనియర్ జర్నలిస్టులు చేసిన ఈ సర్వే ఫలితాలు తెలియచేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా తాను ఇచ్చిన హామీలు నెరవేర్చుకుండా ప్రజలను మోసం చేసిన నాయకుడిగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికి చూస్తున్నారని ఈ సర్వే తేల్చేసింది..
see also..