ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోతే జీవితంలో పంచాంగం చెప్పడం మానేస్తామని అంటున్నారు దాదాపు నలబై మంది పండితులు.నేడు శ్రీ విళంబి నామ సవంత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని పురష్కరించుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తు గురించి పంచాంగం చెప్పించారు .
ప్రగతిభవన్ లో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పిన పంచాంగం ఇదే.!!
ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ విళంబి అంటే పొడవువైన అని అర్ధం.అధిక మాసాలు ఎక్కువ ఉన్నందున దీనిని పొడవైన సవంత్సరంగా చెబుతారని పండితులు తెలిపారు.ఈ సవంత్సరం అక్టోబర్ నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకంలో ఉన్న అన్ని సమస్యలన్నీ తీరిపోతాయి.
వైఎస్ జగన్ దెబ్బకు జాతీయ స్థాయిలో కదలిక..!
అంతే కాకుండా ఏకంగా రాజయోగం పడుతుంది.రానున్న ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతారు.ఏకంగా నూట ముప్పై ఐదు ఎమ్మెల్యేలను గెలుస్తుందని పంచాంగ కర్తలు తెలిపారు,ఏకంగా పన్నెండు సవంత్సరాల ఎనిమిది నెలల పద్దెనిమిది రోజులు ముఖ్యమంత్రిగా ఉంటారు .ఒకవేళ అలా జరక్కపోతే మేము నలబై మంది పంచాంగం చెప్పడం మానేస్తామని తెలిపారు .చూడాలి మరి పంచాంగం ఎంతవరకు నిజమవుతుందో..!