గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను తుంగలో తొక్కిన విధానానికి నిరసనగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఈ రోజు లోక్ సభలో ఎన్డీఏ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెల్సిందే.
see also : చలించిన మంత్రి కేటీఆర్..!!
అయితే ఈ రోజు శుక్రవారం వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను లోక్ సభ
స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ కార్యక్రమాల్లో పెట్టారు.ఈ రోజు సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని చదివి వినిపించారు.
see also :జగన్‌పై ఉన్న అక్రమ కేసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
అయితే సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానాన్ని సమర్ధించే సభ్యులను లెక్కపెట్టే వీలు ఉండదు కాబట్టి సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.లోక్ సభ నియమావళిలోని పదిహేడు అధ్యాయం నూట తొంబై ఎనిమిది (బీ)నిబంధన మేరకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గారిచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయి..హౌజ్ అదుపులోకి వస్తే దానిపై చర్చ చేపడతాం అని ఆమె సభలో ప్రకటించారు .
see also :శేఖర్‌రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్పకూడే..!!