నేనా.. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానా..? లేదు, లేదు ఆ రోజులు పోయాయ్..! ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2014 ఎన్నికల్లో నేను చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన మాట వాస్తవమే. అప్పటి పరిస్థితులను బట్టి అలా చేశా..! కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు అవినీతిని దగ్గరుండి చూశా..? చంద్రబాబు అవినీతిలో పాలుపంచుకోవడం ఇష్టంలేక బయటకు వచ్చేశా..! 2014 ఎన్నికల్లో జగన్‌కు కాకుండా.. చంద్రబాబుకు సపోర్ట్‌చేసి చాలా పెద్ద తప్పు చేశా..? కావాలంటే ఇప్పుడు జగన్‌కు మద్దతు ఇచ్చేందుకు నేను రెడీ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీకి చెందిన ఓ ఎంపీతో అన్న మాటలు ఇవి.
see also..వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత..!
అయితే, వైసీపీ ఎంపీ వరప్రసాద్ ఇటీవల కాలంలో జనసేన అదినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా కలిశానని వరప్రసాద్ తెలిపారు. ఆ సమయంలో ఇరువురి మధ్య జరిగిన సంభాషనను వరప్రసాద్ మీడియాకు వివరించారు. ప్రత్యేక హోదా గురించి వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో బాగా పోరాడుతున్నారని అభినందించారన్నారు. మా పార్టీ వాళ్లను వైసీపీ నేతలు ఎందుకు విమర్శిస్తున్నారు… అందుకు గల కారణమేంటని పవన్ నన్ను(వరప్రసాద్) ప్రశ్నించారని, అందునే స్పందించిన నేను (వరప్రసాద్) చంద్రబాబు అవినీతిపై మేం పోరాడుతుంటే.. మీరేమో టీడీపీకి మద్దతు ఇవ్వడమేంటని ప్రశ్నించానన్నారు. పోలవరం అవినీతి విషయంలోనూ మేం ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే.. మాకంటే మీరు ముందు స్పందించి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించడమేంటని ప్రశ్నించారన్నారు. అందుకు స్పందించిన పవన్ కల్యాణ్ అది గతం.. ఇప్పుడు పరిస్థితి అలా లేదు అంటూ జవాబిచ్చారన్నారు. ఏదేమైనా అయితే, 2019 ఎన్నికల నేపథ్యంలో జగన్‌కు మేం మద్దతు ఇచ్చేందుకు రెడీ అన్న పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
see also..నేను చనిపోవడం చూడాలనుకుంటే వీడియో కాల్ చేయమని లవర్ ని అడిగి..లైవ్ లో ఉరికి బలి