శేఖర్‌రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులు జైలుకే..!! శేఖర్‌రెడ్డి, ఇతను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే,
దేశ రాజకీయ నాయకులతోపాటు.. ఏసీబీ, ఈడీ అధికారులకు బాగా సుపరిచిత వ్యక్తి. ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో అయితే శేఖర్‌రెడ్డి పేరు మారు మోగిపోయింది. ఇంతకీ అంతలా శేఖర్‌రెడ్డి పేరు మారుమోగడానికి గల కారణమేంటి. అంత ఘనకార్యం ఏం చేశాడు అతను. అనుకుంటున్నారా..? అబ్బే అతనేం చేయలేదండీ.. అతని వద్ద ఏసీబీ, ఈడీ అధికారులు, ఐటీ విజిలెన్స్ విభాగాలు జస్ట్. 180 కోట్ల రూపాయల నగదు, 117 కిలోల బంగారం బయటపడింది అంతే..!! అదేంటి అంత భారీ సొమ్మును జస్ట్ అంటూ చీప్‌గా తీసేశారనుకుంటున్నారా.. అలా అనడానికి కారణాలు లేకపోలేదు. శేఖర్‌రెడ్డి నుంచి ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుంది జస్ట్ 20 శాతమే.. మిగిలిన 80 శాతం సొమ్ము అలానే ఉంది. పై స్థాయి నేతల ఒత్తిడి వల్ల ఆ 80 శాతం సొమ్ము శేఖర్‌రెడ్డి వద్దే ఉండిపోయింది. అందుకే ”జస్ట్”.
see also : జగన్ దెబ్బకు దిగివచ్చిన టీడీపీ సర్కార్
see also : నాన్నకు చెడ్డపేరు తీసుకురాను..లోకేష్
ఇక అసలు విషయానికొస్తే.. ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో మారుమోగిపోయిన శేఖర్‌రెడ్డి పేరు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అదెలా అంటారా..? అదేనండీ నిన్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభతో అన్న మాట. ఆ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. టీడీపీ అవినీతి పాలనను ఎండగట్టాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి పరుడని, ఆ వారసత్వాన్ని మంత్రి నారా లోకేష్ తీసుకున్నాడన్నారు. అంతేకాకుండా శేఖర్‌రెడ్డికి, నారా లోకేష్‌కు అక్రమ లావాదేవీలు ఉన్నాయని, వాటిని త్వరలో బయటపెడతానని చెప్పారు పవన్ కల్యాణ్. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న కొత్త కంపెనీల్లోనూ శేఖర్‌రెడ్డికి నారా లోకేష్ వాటా ఇచ్చినట్లు సమాచారం. ఏపీలో శేఖర్‌రెడ్డికి సంబంధించిన బంగారం వ్యాపారం, కొత్త కంపెనీలు వంటి వ్యాపార లావాదేవీలను నారా లోకేష్ నిర్వహిస్తాడన్నది పవన్ కల్యాణ్ ఆంతర్యం. అయితే, ఈ విషయాలపై శేఖర్‌రెడ్డి గనుక నోరు విప్పితే తండ్రీ కొడుకులు ఇద్దరూ జైలుకెళ్లడం గ్యారెంటీ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. మరి పవన్ కల్యాణ్ మంత్రి నారా లోకేష్, శేఖర్‌రెడ్డిల అక్రమ లావాదేవీలను ఎప్పుడు బయటపెడతాడో.. ఏమో..!!