ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసన సభలో టీ డీ పీ అధినేత నారా చంద్రబాబునాయుడు 40ఏళ్ల రాజకీయ జీవితంపై ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. నాలాంటి యువకుడికి మా నాన్న చంద్రబాబు రోల్‌మోడల్ అని లోకేష్ వాఖ్యానించారు.64ఏళ్ల వయసులో 24ఏళ్ల వ్యక్తిలా పరిగెడతారు. మా నాన్న ఈ స్థాయికి వచ్చారంటే దాని వెనుక మా అమ్మగారి కృషి ఎంత గానో ఉందన్నారు .ఆమె కష్టం వల్లే మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి ఈ స్థాయికి వచ్చారన్నారు.
see also :ఏన్నారై శాఖకు చరిత్రలో ఏన్నడు లేనన్ని నిధులు..!
ఏపీ లో ఫ్యాక్షన్ గ్రామాల్లోని పిల్లలు పగలు, ప్రతీకారాలు అని పక్కదారి పట్టకుండా.. వారు చదువుకోవాలనే ఉద్దేశంతోనే మోడల్ స్కూల్ ప్రారంభించిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన మా తాతగారు, నాన్నగారంత గొప్ప పేరు వస్తుందో రాదో తెలియదు కానీ, ఏనాడూ వాళ్లకు చెడ్డపేరు తీసుకురానని తెలిపారు.