ఇటు టాలీవుడ్ అటు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న వార్త .ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా ఇదే నెలలో నాలుగు ఏళ్ళ కిందట అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ జనసేన .జనసేన పార్టీ గురించి ప్రముఖ టాలీవుడ్ క్రిటిక్ ,నటుడు అయిన కత్తి మహేష్ ఒక ఆడియో టేపును బయటపెట్టాడు .ఈ ఆడియోలో జనసేన మీడియా ప్రతినిధి హరిప్రసాద్ తనను రైతు సమస్యల గురించి మాట్లాడాలి ..సమయం ఇవ్వానది అని ఉత్తరాంధ్ర కు చెందిన రాంప్రసాద్ కాల్ చేస్తే ఏమి మాట్లాడాడో సవివరంగా ఉన్న ఆడియో టేపును కత్తి మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టాడు.మీరు ఒక లుక్ వేయండి జనసేన పార్టీకి రైతుల సమస్యల పట్ల ఏమి అభిప్రాయం ఉందో ..!
see also :తెలంగాణ రాష్ట్ర అప్పులపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ..!
రాంప్రసాద్: జనసేన మీడియా అధికార ప్రతినిధి హరిప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి.
హరిప్రసాద్: గుడ్ మార్నింగ్.చెప్పండి .
రాంప్రసాద్: సర్ నేను రాంప్రసాద్ అండి. ఒకసారి మీ వద్దకు వస్తాను.
హరిప్రసాద్: ఏ రాంప్రసాద్.ఎక్కడ రాంప్రసాద్ ?
రాంప్రసాద్: నేను రైతు సమస్యల మీద పోరాటం చేస్తుంటానండి. నేను సర్‌ను కలవడానికి నిన్నకూడా వచ్చాను.
హరిప్రసాద్: ఆ విషయాలు చూసేది నేను కాదు.
రాంప్రసాద్: మీడియా హరిప్రసాద్ అనే చెప్పారు సర్.
హరిప్రసాద్: మీరు దయచేసి ఫోన్లు చేయడం మానేయండి( కాస్త కోపంగా తీవ్ర స్వరంతో )
రాంప్రసాద్: ఇక నేను ఎవరిని కలవాలండి !?
హరిప్రసాద్: దేవుడి.. దేవుడిని.. ఫోన్ కట్.
see also :ఏపీలో టీడీపీ దెబ్బకు యూపిలో బీజేపీ ఓడిపోయిందంట..!
రైతుల సమస్యల గురించి మాట్లాడాలి. టైం ఇవ్వండి. అంటే, దేవుడితో చెప్పుకోండి అనే జనసేన మీడియా ప్రతినిధి. పవన్ కళ్యాణ్ మా దేవుడు అని నమ్మే జనసైన్యం. జనసైనికులారా…ఇలాంటివాళ్ళు మిమ్మల్ని జమ సైనికులుగా చేసి వేరే పార్టీలకు లెక్కగట్టేస్తారు. జాగ్రత్త! pic.twitter.com/M9h1g5fGj0
— Kathi Mahesh (@kathimahesh) March 14, 2018