తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మీద ప్రతిపక్షాలు చేసే ఆరోపణలో ఒకటి గత నాలుగు ఏండ్లుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది.ధనిక రాష్ట్రమని అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ ,బీజేపీ ,ఇతర వామపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన
ఆరోపణ.
ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు ఏండ్లుగా రెండు లక్షల కోట్ల రూపాయల అప్పుచేసిందని ఆరోపించాడు.దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అప్పులపై ఎమ్మెల్యే కిషన్ రెడ్డి చేస్తున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
రాష్ట్రం ఏర్పడే సమయం నాటికీ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అప్పు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు.ఇప్పుడు దానితో కల్పుకొని మొత్తం ఒక లక్ష నలబై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు అని వివరించారు.అయిన నాలుగు యేండ్లలో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎక్కడైనా ప్రభుత్వం చేస్తుందా అని ప్రశ్నించారు ..