తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి చైర్మన్ స్వామీగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరి ..స్వామీగౌడ్ కంటికి తీవ్రగాయమవ్వడానికి ప్రధానకారణం అని నిర్ధారించి ఆ ఇద్దరి శాసనసభ సభ్యత్వాన్ని అసెంబ్లీ రద్దు చేసిన సంగతి తెల్సిందే.
See Also:జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!
ఇదే అంశం గురించి తెలంగాణ రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి అని తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు.అయితే తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు లేదా సస్పెన్షన్ పడే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
See Also:2019లో జగనే సీఎం.. లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు..!!
ఈ క్రమంలో కోమటిరెడ్డి ,సంపత్ కుమార్ తో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అయిన వంశీధర్ రెడ్డి ,రామ్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నించారు అని అసెంబ్లీ కమిటీ చూసిన వీడియో పుటేజీలో స్పష్టంగా కనిపించింది.అయితే ఈ ఇద్దరి ఎమ్మెల్యేలపై వేటు వేయాలా ..లేదా సభ్యత్వం రద్దు చేయాలా అని ఈరోజు బుధవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తేలనున్నది ..
See Also:వైసీపీలోకి భూమా నాగి రెడ్డి ప్రాణ మిత్రుడు ఆళ్ళగడ్డ ఏవి సుబ్బారెడ్డి.. ?