Home / Uncategorized / సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధిని ప్రతి పట్టణంలో చూడాలనుకుంటున్న..కేటీఆర్

సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధిని ప్రతి పట్టణంలో చూడాలనుకుంటున్న..కేటీఆర్

మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణం సిద్ధిపేట పట్టణంలా ఉండేలా మీ ప్రణాళికలు రూపొందించాలి. సిద్ధిపేట పట్టణాన్ని ఒకసారి సందర్శించండి. అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి మీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేయాలని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కమిషనర్లకు రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.ప్రతి పట్టణంలో ఫుట్ పాత్, జంక్షన్ల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు, ఓపెన్ ఏయిర్ ఆడిటోరియం, స్మశాన వాటికలు, వైకుంఠ ధామం, ఆకర్షణీయమైన వీధి దీపాలు సిద్ధిపేట పట్టణంలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ప్రణాళికా బద్ధంగా రాష్ట్రంలోని 74 పట్టణాలలో పటిష్టంగా చేపట్టేలా జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.పురపాలక సంఘాల సర్వతోముఖాభివృద్ధికి పాటు పడేలా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలకు వెంటనే పట్టణ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.

see also :కాంగ్రెస్ సభ్యులపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్ రెడ్డి

see also :వైఎస్ జగన్ గురించి..ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌ సంచలన వాఖ్యలు..!

ప్రతి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తయారుచేసేలా పారిశుధ్యానికి అత్యంత అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇందుకోసం అవసరమైన రవాణా వాహనాలు, డ్రైనేజీ, రోడ్లు, సిట్టింగ్ ఏర్నాస్, ఇతరత్రా పట్టణాభివృద్ధికై టీయూఎఫ్ఐడీసీ ద్వారా ఇవ్వనున్న డబ్బులను నేరుగా జిల్లా కలెక్టర్లకే అందించి, వాటిని ఖర్చు పెట్టే బాధ్యతను వారికే అప్పగిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఆదేశించారు.సిద్ధిపేట కోమటి చెరువు లాంటి.. బెస్ట్ ప్రాక్టీసులను వాట్సాప్ సందేశాల ద్వారా పంచుకుంటూ తమ తమ పట్టణాలలో కూడా సుందరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచించుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచనలు చేశారు.మీకు మీ మంత్రి హరీశ్ రావు గారు అన్నీ చేశారు.. కాబట్టి మీరు సిద్ధిపేటను వదిలి ఇతర మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఉండి వాటిని అభివృద్ధి పర్చాలని సిద్ధిపేట జిల్లా సంయుక్త కలెక్టర్ పద్మాకర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో సూచించారు.

see also :కేటీఆర్‌ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మ‌న్ ఫిదా..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat