ప్రజా సమస్యలు తీర్చడానికే పాదయాత్ర చేస్తూ అండగా నేనున్నానంటూ ప్రజలకు భరోసానిస్తూ ఏపీ ప్రతి పక‌్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఆదివారం యాత్ర చీరాల, కొత్తపేట, పేరాల, ఐటీసీ, ఆదినారాయణపురం, ఈపూరుపాలెం మీదుగా సాగింది. ఆయన భరోసా కొత్త ఆశలను నింపింది.ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆత్మీయతను పంచి అడుగులో అడుగేస్తున్నారు.
SEE ALSO..జగన్ పాదయాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వగానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!
ఈ ప్రజాసంకల్పానికి బ్రహ్మరథం పడుతున్నారు. పిల్లలా, పెద్దలా గుండెలను తడుతూముందడుగు వేస్తున్న వైఎస్ జగన్‌కు జేజేలు పలలుకుతున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. వైఎస్ జగన్ రాకతో కరువు గడ్డ పులకించింది. పాదయాత్ర మొదలు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీలు అన్నదాతలకు ఆసరానిచ్చాయి. పేదల పక్షాన చేసిన ప్రకటనలు కొండంత నమ్మకాన్ని కలిగించాయి. జననేత దిగ్విజయంగా సాగించిన పాదయాత్ర ఆదివారం ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా పొలిమేరకు చేరుకుంది. జగన్ అభిమానులు, కార్యకర్తలు వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
see also..గవర్నర్ పై దాడికి యత్నించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి ..!