ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చేపట్టిన సమీకరణాలు టీడీపీలో అతి పెద్ద సంక్షోభానికి దారి తీయబోతున్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, గతంలో బోండా ఉమకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబు తీరా మంత్రివర్గ విస్తరణలో బోండా ఉమకు చోటు కల్పించకపోగా.. పార్టీ కార్యక్రమాల్లోనూ బోండా ఉమను పక్కనపెట్టేశారు. ఇప్పుడు అదే పరిస్థితి వర్లరామయ్యకు కూడా ఎదురైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దళిత సామాజిక కోటాలో తనకు రాజ్యసభ సీటు వస్తుందని ఆశించిన వర్ల రామయ్యకు భంగపాటు తప్పలేదు. మొదట్నుంచి రాజ్యసభ సీటుపై వర్ల రామయ్యకు ఆశచూపిన చంద్రబాబు తీరా వెన్నుపోటు పొడిచారు.
see also : వైఎస్ జగన్ రాకతో కరువు గడ్డ పులకించింది….!
see also : టీడీపీ రాజ్యసభ అభ్యర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
టీడీపీ నుంచి రాజ్యసభ సీటుపై ఆశలు పెంచుకున్న వర్ల రాయ్య టీడీపీ కార్యాలయంలోకాని, బయటకానీ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌పై, వైసీపీ ఎమ్మెల్యేలపై దూకుడుగా వ్యవహరిస్తూ, తీవ్ర వివిమర్శలు చేసేవాడు. జగన్‌పై ఇష్టానుశారంగా రెచ్చిపోయేవారు వర్ల రామయ్య. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ వచ్చిన వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు కేటాయించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురి అయ్యాడు.
see also : ”2019లో జగన్‌కు జైలు.. టీడీపీకి గెలుపు” కన్ఫాం..!!
పార్టీ కోసం కోట్లు తగలేసి, వైఎస్ జగన్‌ను బద్నాం చేయడానికి వివాదలు నెత్తిన పెట్టుకున్నా.. తనకు చంద్రబాబు అన్యాయం చేశాడని వర్ల రామయ్య మండిపడుతున్నాడు. టీడీపీ పార్టీ తనకు కేటాయించిన పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే, రాజీనామాపై టీడీపీ నేతలు ఎంత సర్దిచెప్పినా వర్లరామయ్య మాత్రం రాజీనామాకే మొగ్గు చూపుతున్నారు. మరి రేపో మాపో వర్ల రామయ్యతోపాటు, రాజ్యసభ సీటుపై చివరి వరకు ఆశలు పెట్టుకున్న బీద మస్తాన్‌రావు కూడా టీడీపీకీ రాజీనామా చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాపయడుతన్నారు.