ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 సాధారణ ఎన్నికల్లోపు జైలుకు పోవడం ఖాయమని, అలాగే అదే ఏడాది ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కాగా, ఇవాళ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకునే విషయంలో నిరంతరం విఫలమవుతున్నారన్నారు. అలాగే, శాసనసభలోనూ అడుగడుగునా విఫలమవుతున్నందునే.. అసెంబ్లీకి వచ్చేందుకు జగన్ భయపడుతున్నారన్నారు.
see also : టీడీపీ రాజ్యసభ అభ్యర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
see also : సంతన్నకు రాజ్యసభ.. శుభాకాంక్షలు తెలిపిన దరువు అధినేత
see also : దళితుడిని అయినందునే తీవ్రంగా మరోసారి చంద్రబాబు అవమానించారని..వర్ల రామయ్య తీవ్ర నిరాశ
అసెంబ్లీకి రాని వ్యక్తి రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉండేందుకు అర్హుడు కాదని పేర్కొన్నారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి వైఎస్ఆర్, ఆయన తండ్రి రాజారెడ్డిలది నేర చరిత్రేనని, ఆ చరిత్రను నిలబెట్టేందుకు వైఎస్ జగన్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని ఎద్దేవ చేశారు. జగన్‌పై ఉన్న కేసులన్నీ మరికొన్ని రోజుల్లో ఓ కొలిక్కి వచ్చి జగన్ జైలుకు పోలవడం కన్ఫాం అని చెప్పారు. వైఎస్ జగన్‌పై వందలకొద్దీ రౌడీయిజం కేసులు ఉన్నాయని, తనపై ఉన్న కేసులను కొట్టివేయించుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మోడీ కాళ్లు పట్టుకోవడం జగన్‌కే చెల్లిందన్నారు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర రోల్ ప్లే చేసే దమ్ము వైఎస్ జగన్‌కు లేదన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేసి 17నెలలు జైల్లో ఉండి, 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి, ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లేటటువంటినేర పూరిత చర్యల వల్ల వైఎస్ జగన్ పేరు ఏపీ, దేశంలోని కొంతమందికి తెలిసిందన్నారు. అటువంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించడానికి అర్హుడు కాదని అన్నారు ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు.