వారం రోజులుగా అమరావతిలో సీబీఐ మకాం..! కారణం తెలిస్తే షాక్..!! అవును, గత వారం రోజులుగా సీబీఐ (Central Bureau of Investigation) ఏపీ రాజధాని అమరావతిలో మకాం వేసింది. ఏపీ విడిపోయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమరావతిలో అడుగుపెట్టని సీబీఐ.. ఇప్పుడెందుకు అడుగుపెట్టినట్టు..? ఇందుకు కారణమేమిటి…? అసలు నీరవ్ మోడీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింకేంటి..? పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసును విచారిస్తున్న సీబీఐకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయా..? అన్న ప్రశ్నలకు సోషల్ మీడియాలో ఓ వర్త సమాధానం చెబుతోంది. అయితే, ఆ వార్త వివరాలను బట్టి చూస్తే సమాచారం కింది విధంగా ఉంది.
see also : తెలుగు రాజకీయాల్లో రికార్డు సృష్టించిన జగన్..!!
see also : పక్కింటి మహిళ స్నానం చేస్తుంటే ..వీడియో తీసిన పోలీసు…!
అసలు విషయానికొస్తే .. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ PNB (పంజాబ్ నేషనల్ బ్యాంక్)లో వేలకోట్ల రుణం ఎగ్గొట్టి(కుంభకోణం) దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే, రూపాయి రూపాయి కూడగట్టుకుని వారి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో, పిల్లల చదువుల కోసమనో.. లేక సొంతింటి కలను నిజం చేసుకుందామనో.. లేక భవిష్యత్ ఖర్చులకనో..!! మధ్య తరగతి ప్రజలు దాచుకున్న నగదును రాంబందులా వచ్చి దోచుకెళ్లిన నీరవ్ మోడీతో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా లింకులు ఉన్నాయనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త సారాంశం.
see also : చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!!
ఇందుకు సంబంధించి రుజువులు కూడా ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తుండటం గమనార్హం. ఈ వార్తకు సంబంధించి మరింత లోతుగా వెళ్తే సంచలన విషయాలు బయటపడ్డాయి. భాగ్యనగరం, మహానగరంగా పిలుచుకునే హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలోగల, గుంటూరుకు చెందిన ఓ వ్యాపారికి సంబంధించిన 200 ఎకరాల్లోగల గీతాంజలి జెమ్స్ పేరుమీద గల స్థలాన్ని 2014వ సంవత్సరంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీ అప్పటి రేట్లను బట్టి కొనుగోలు చేశాడు. అయితే, నీరవ్ మోడీ కొనుగోలు చేసిన ఈ గీతాంజలి జెమ్స్ పార్క్‌లో నీరవ్ అండ్ కో .. 3,500 కోట్ల అక్రమాలకు పాల్పడ్డట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే, నీరవ్ మోడీకి ఆ స్థలాన్ని విక్రయించిన గుంటూరు వ్యాపారి.. ఇప్పటికీ గీతాంజలి జెమ్స్ సెజ్‌లో భాగస్వామిగానే ఉన్నాడు. గుంటూరు వ్యాపారి తమ్ముడు టీడీపీ నాయకుడు, గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ కూడా చేశాడు.
see also : వైసీపీ… ఓ దద్దమ్మల పార్టీ..!!
ఆ విషయం కాసేపు అటుంచితే.. 2011లో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చంద్రబాబు అక్రమాస్తులకు సంబంధించి కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. విజయమ్మ వేసిన ఆ పిటిషన్‌లో గుంటూరుకు చెందిన వ్యాపారికి, ఏపీ ముఖ్యమంత్రికి గల సంబంధాన్ని క్లుప్తంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ విషయంపై కాకున్నా.. నీరవ్‌మోడీ కేసు విచారణలో భాగంగా సీబీఐ గుంటూరుకు రావడం గమనార్హం. గుంటూరులోని గీతాంజలి జెమ్స్ పార్క్ వ్యాపారిపై సీబీఐ నిఘా ఉంచింది. ఆ వ్యాపారికి, చంద్రబాబుకు ఉన్న సంబంధాలపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది. సీబీఐ నీరవ్ మోడీ కేసులో భాగంగా గీతాంజలి జెమ్స్ పార్క్ వ్యాపారికి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్యగల సంబంధాలపై విచారణను వేగవంతం చేసింది.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పై వార్తకు సంబంధించి ప్రముఖ జర్నలిస్ట్ గౌరవ్ ప్రదాన్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు, నీరవ్ మోడీకి ఉన్న సంబంధాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడ్డ నీరవ్ మోడీకి, మీకు (చంద్రబాబు) సంబంధాలు లేవా..? అంటూ ప్రశ్నించారు గౌరవ్ ప్రదాన్.