ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తన స్వార్థం కోసం పణంగా పెట్టారని ఆంధ్రుల అందరి నుంచి నిలదీతలు ఎదుర్కుంటున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే హోదా కారణంగా ఇరకాటంలో పడే పరిస్థితి ఎదురైంది. పక్క రాష్ట్ర సీఎం చేసిన డిమాండ్‌కు చంద్రబాబు సహా ఆయన టీం దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిందని అంటున్నారు.
SEE ALSO :నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం..!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తమ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టంచేశారు. తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో హోదా డిమాండ్‌పై ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. `ఒడిశాకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని మేము ఎప్పుడూ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. మరోసారి డిమాండ్ సాధనకు పోరాడుతాం` అని ఆయన మీడియాతో చెప్పారు. కాగా, ఒడిశా ముఖ్యమంత్రి తీరులో అయినా చంద్రబాబు గళం విప్పడం పలువురు కామెంట్ చేస్తుండటం గమనార్హం.
SEE ALSO :ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టుకోండి.. ప్రజలలోకి వెళ్లి పోరాటం చేస్తా
లోక్‌సభలో బీజేడీ నేత బర్తుృహరి మెహతాబ్ అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఒడిశా కూడా తమ డిమాండ్‌ను తీవ్రం చేస్తుందన్నారు. `ప్రత్యేక హోదా కోసం ఒడిశా సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ ఏపీ ప్రత్యేక హోదా సాధిస్తే.. మా డిమాండ్ కోసం మేము కూడా పెద్దఎత్తున ఉద్యమిస్తాం అని చెప్పారు. ఒక రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇచ్చి మరోరాష్ర్టానికి ఇవ్వకపోవడం సరికాదు`అని పేర్కొన్నారు.