భారతరదేశంలో పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తుందనడానికి ఉదాహరణ ఈ సంఘటనే. అయితే, ఈ సంఘటన సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని డియోరియా జిల్లా భత్పరాణి ప్రాంతంలో చోటు చేసుకుంది. కాగా, ఇటీవల కాలంలో సమాజంలో అక్రమ సంబంధాలతో కూలుతున్న కాపురాలు కోకొల్లలు. ఉదయం లేవంగానే లే టీవీ ఛానెల్ చూసినా.. ఏ పేపర్ చదివినా ఇదే తంతు. దీనికంతటికి కారణం పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తుండటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. ఉత్తర ప్రదేశ్లోని డియోరియా జిల్లా భత్పరాణి ప్రాంతంలో కాపురముంటోంది రామనాధన్ కుటుంబం (తెలుగువారు) అయితే, రామనాథన్ కు తులావతి అనే 37 ఏళ్ల భార్య, లీలాధర్ అనే 17 ఏళ్ల కుమారుడు ఉన్నారు. రామనాథన్ తన భార్య తులావతి సంపాదనమీదే ఆధారపడుతూ జీవనం సాగించేవాడు. తులావతి వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు తిరుగుతుండటంతో భర్త రామనాధన్ ఇంటిపట్టునే ఉండేవాడు. ఇక లీలాధర్ కాలేజీకి వెళ్తూ వస్తుండేవాడు.
see also : వజ్రమ్మ మాటలకు మంత్రి కేటీఆర్ ఫిదా..!!
see also : బిగ్ బ్రేకింగ్: భారత ఉప రాష్ట్రపతి రాజీనామా..!!
ఈ నేపథ్యంలో ఫేస్బుక్ చాటింగ్ అలవాటున్న రామనాధన్కు సౌదీ అరేబియాలో ఉండే తెలుగు మహిళ షాజియా బేగం అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అదే సందర్భంలో తన భార్య తులావతి వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలు తిరుగుతుండటంతో ఇదే అదునుగా భావించిన రామనాధన్ షాజియా బేగంను సౌదీ అరేబియా నుంచి తన ఇంటికి రప్పించింది. ఇంట్లోనే తన కొడుకు లీలాధర్కు తెలియకుండా సహజీవనం చేయడం మొదలు పెట్టాడు.
see also : వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకే ఓటేస్తారు..!!
ఇలా కొన్ని రోజులు గడిచాక షాజియా బేగం రాత్రిళ్లు మాత్రమే కాకుండా.. పగలు కూడా రామనాధన్ ఇంటికి రావడం ప్రారంభించింది. ఇలా వారి శృంగార కార్యకలాపాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఒక రోజు కాలేజీ నుంచి సడెన్గా ఇంటికి వచ్చిన లీలాధర్ తండ్రి శృంగార కార్యకలాపాలను కళ్లారా చూశాడు. మరుసటి రోజే లీలాధర్ శవమై కనిపించాడు.
see also : అభిమానులకు షాకిచ్చిన పవన్ కళ్యాణ్..!
విషయం కాస్తా.. పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లీలాధర్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు.. రామనాధన్ అసలు నిజం చెప్పాడు. షాజియా బేగం, తను కలిసి లీలాధర్ను చంపామని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు రామనాధన్. తన అక్రమ సంబంధం ఎక్కడ భార్యకు చెబుతాడోనన్న భయంతో తన సొంత కొడుకునే సమాధి చేసిన రామనాధన్ ఇప్పుడు ఊచలు లెక్కపెడు.