వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకే ఓటేస్తారు..!! అవును, మీరు చదివింది నిజమే. త్వరలో జగరనున్నరాజ్యసభ సభ్యుల ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ టీడీపీకే ఓటేస్తారని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడిగా దేశంలోనే సీనియర్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి కేంద్రం అన్యాయం చేసింది కాబట్టే టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేశారని, కానీ ఎన్డీయే నుంచి ఎప్పుడు బయటకు వస్తామన్న విషయం సీఎం చంద్రబాబు అభిప్రాయం మేరకే ఉంటుందన్నారు మంత్రి ఆదినారాయణరెడ్డి.
see also : బిగ్ బ్రేకింగ్: భారత ఉప రాష్ట్రపతి రాజీనామా..!!
see also : జనసేన పార్టీలో చేరిన ఏపీపీసీసీ ఉపాధ్యక్షుడు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆది నారాయణరెడ్డి. వైఎస్ జగన్‌పై వందలకొద్దీ రౌడీయిజం కేసులు ఉన్నాయన్నారు. తనపై ఉన్న కేసులను కొట్టివేయించుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మోడీ కాళ్లు పట్టుకోవడం జగన్‌కే చెల్లిందన్నారు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర రోల్ ప్లే చేసే దమ్ము వైఎస్ జగన్‌కు లేదన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేసి 17నెలలు జైల్లో ఉండి, 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి, ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లేటటువంటినేర పూరిత చర్యల వల్ల వైఎస్ జగన్ పేరు ఏపీ, దేశంలోని కొంతమందికి తెలిసిందన్నారు. అటువంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించడానికి అర్హుడు కాదని అన్నారు.
see also : అభిమానులకు షాకిచ్చిన పవన్ కళ్యాణ్..!
see also : వ్యవసాయం పథకానికి రైతులక్ష్మిగా నామకరణం..!
వైఎస్ జగన్ పుట్టేకే.. జగన్‌ను రౌడీగా మార్చిందన్నారు. జగన్‌కు చిన్నప్పట్నుంచి నేర పవృత్తి అలవాటేనన్నారు. వైఎస్ జగన్ వంటి నేరపూరిత వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందన్నారు. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల చరిత్రలో చిన్న కేసునైనా నీవు చూపించగలా..? అంటూ జగన్‌ను ప్రశ్నించారు మంత్రి ఆదినారాయణరెడ్డి.