తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ..రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు అరుదైన అవకాశం దక్కింది.ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించిన జాతీయ ప్రజా ప్రతినిధుల సమావేశానికి మోడరేటర్ గా ఆమె వ్యవహరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరైన ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తూ…. అతిథులను ఆహ్వానిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన 150 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
see also :సాయిపల్లవి ప్రేమలో ఉందా ..!
see also :2019లో సీఎం జగనే.. టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!