యువనేత ,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న ( శుక్రవారం ) సిద్ధిపేట,దుబ్బాక ,రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పర్యటనలో భాగంగా మంత్రి నేతన్నలతో కలిసి మాట్లాడి..వారిసమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంలోనే మంత్రి కేటీఆర్ కు ఓ ఆప్యాయపూరిత పలుకరింపు లభించింది.
see also :వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..!
see also :వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకే ఓటేస్తారు..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో కొన్ని ఏండ్ల క్రితం నివసించిన వజ్రవ్వ అనే మహిళ కేటీఆర్‌ను కలుసుకుని, తనను తాను పరిచయం చేసుకున్నారు. “మా తల్లిగారిది చింతమడకనే బిడ్డా… చిన్నప్పుడు చింతమడకలో మీ నాయన చంద్రశేఖర్‌రావుతో కలిసి మీ బాయికాడ మోట కొట్టిన. మీ వ్యవసాయపు పనులు మా నాయన కూస వెంకట రాజయ్య చేసేవాడు. పెండ్లి చేసుకొని దుబ్బాకలో ఉంటున్నా” అంటూ ఆమె కేటీఆర్‌ను పలుకరించారు. వజ్రమ్మ మాటలకు ఫిదా అయినకేటీఆర్.. అమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చేస్తున్నావు? అంటూ వాకబు చేశారు. మా నాయనను కలిపిస్తా అని వజ్రవ్వకు కేటీఆర్ చెప్పడంతో ఆమె ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసింది.
see also :బిగ్ బ్రేకింగ్: భారత ఉప రాష్ట్రపతి రాజీనామా..!!