ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియా సమావేశంలో కానీ పార్టీ నేతల సమావేశంలో కానీ అధికారక సమావేశాల్లో కానీ ఆయన తన గురించి చెప్పుకునే విషయం నేను దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేతను.దేశంలో నా అంత అనుభవం ఉన్ననాయకుడు ఎవరు లేరు.నేను నిప్పులా
నిజాయితీగా బ్రతికాను అని ఒకటే డబ్బా కొట్టుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కారు.
అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పోరాటాలు ,ఉద్యమాలు ఫలితంగా ప్రజలు ఇంకా ఆ విషయాన్నీ మరిచిపోలేదు.తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన మోసానికి నిరసనగా కేంద్రసర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడతాను ప్రకటించారు.అయితే జగన్ చేసిన ప్రకటనను అందరు మరిచిపోవాలని తన పార్టీకి చెందిన ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్న అశోక గజపతి రాజు ,మరో మంత్రి సుజన చౌదరి చేత రాజీనామా చేయించడం ..వాటిని ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆమోదించడం రెండు జరగడం అయిపోయింది.
ఇంతవరకు భాగానే ఉంది కానీ బాబు తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్ధమవుతుంది.అసలు విషయం ఏమిటి జగన్ అవిశ్వాస తీర్మానం పెడతాను అని ప్రకటించడంతో ఏపీ ప్రజల శ్రేయస్సు ,ప్రత్యేక హోదా ముఖ్యమనుకుంటే బాబు కూడా తన పార్టీకి చెందిన ఎంపీలను అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలి .కానీ బాబు ఇవ్వను అంటున్నాడు .మంత్రి పదవులకు అయితే రాజీనామా చేయించాం కానీ ఎన్డీఏ నుండి అయితే మేము ఇంకా బయటకు రాలేదని ప్రకటించి తన స్టెప్ ఏమిటో సవివరంగా వివరించారు.
అయితే ఏపీకి చెందిన మొత్తం ఎంపీలు ఇరవై ఐదు మంది మాత్రమే అయిన కానీ అవిశ్వాస తీర్మానం పెడితే ఎన్డీఏ సర్కారు కూలకపోయిన కానీ ఏపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేశారు ..ప్రజలకు కష్టాలు వస్తే రాజకీయాలను పార్టీలను పక్కన పెట్టి ఎలా పోరాడాతారో యావత్తు దేశానికే అర్ధమై దేశమంతా ఏపీ వైపు చూస్తుంది.కానీ బాబు అలా కాకుండా ఎప్పటిలాగే అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటామని తన నలబై ఏళ్ళ రాజకీయ అనుభవంతో ఏపీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు .ఇప్పుడు తమ తరపున ఎవరు పోరాడుతున్నారో ఆలోచించుకోవాలి ఐదు కోట్ల ఆంధ్రులు ..అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ నా ..ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నా ..!