Home / ANDHRAPRADESH / వైఎస్సార్ చరిష్మా ఉన్నోడు.ఢిల్లీని గడగడలాడించాడు..ఆయన ముందు బాబు ఎంత?

వైఎస్సార్ చరిష్మా ఉన్నోడు.ఢిల్లీని గడగడలాడించాడు..ఆయన ముందు బాబు ఎంత?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.ఇటివల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నాను.దేశంలో అత్యంత సీనియర్నాయకుడ్ని నేనే..నాపై ఒక్క కేసు లేదు.ఇప్పటివరకు నేను నిజాయితీగానే బ్రతికాను.నిప్పులా ఉంటున్నాను.ఇప్పుడు ఎవరన్న నన్ను చూస్తె మర్యాదిస్తారు అని తన గురించి గొప్పగా చెప్పుకున్నారు నారా చంద్రబాబు నాయుడు.ఇదే అంశం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ “దేశంలోనే అత్యంత సీనియర్ పోలిషిచియన్ బాబు ఎలా అయ్యారో అర్ధం
కావడంలేదు.ఒకవేళ ముఖ్యమంత్రిగా అనుకుంటే బాబు కంటే నవీన్ పట్నాయక్ దాదాపు పదిహేడు ఏళ్ళుగా కొనసాగుతూ ఉన్నారు.

SEE ALSO :అకౌంట్ లో రూ 50 ఉంటే చాలు..బ్యాంక్ ఖాతా దారులకు శుభవార్త..!

మరోవైపు పక్క రాష్ట్రమైన తమిళనాడు కరుణానిధి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.మరి ఏ విధంగా ఆయన దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడో అర్ధం కావడంలేదు.ఒకవేళముఖ్యమంత్రిగా ఇయనే ముందున్నారా అంటే ఇయనకంటే ముందు ములాయం సింగ్ ,కళ్యాణ సింగ్ ,అంటోనీ ,ఫరూక్ ముఖ్యమంత్రిగా పని చేశారు.టీడీపీ పార్టీలో సీనియర్ నాయకులా అంటే అయన కంటే ముందే టీడీపీ పార్టీ పెట్టిన కొత్తలో చంద్రబాబు కంటే ముందే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా పని చేశారు.అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ తరపున పోటి చేసిపదహారు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.మరి అప్పుడే అశోక గజపతి రాజు ,కేఈ కృష్ణమూర్తి బాబు కంటే ముందే ఎమ్మెల్యే అయ్యారు.మరి ఏవిధంగా బాబు దేశంలో అత్యంత సీనియర్ నాయకుడో చెప్పాల్సింది.అయితే ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడూ కూడా బాబు సొంతగా గెలిచి అధికారాన్ని చేపట్టలేదు.

SEE ALSO :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

1995లో చంద్రబాబు ఎన్టీఆర్ దగ్గర నుండి ఎమ్మెల్యేలను ,పార్టీను లాక్కొని ముఖ్యమంత్రి అయ్యారు.ఆ తర్వాత బీజేపీ ను అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు.గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ,బీజేపీ పార్టీను అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు తప్పా సొంతంగా కాలేకపోయారు.అయితే ఎప్పుడు ఎవరితో నిలబడితే పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుసు కాబట్టి బాబు ఇలా గెలుస్తూ వస్తున్నాడు.అదే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2004లో టీఆర్ఎస్ ,వామపక్షాలతో కల్సి బరిలోకి దిగి బాబు తొమ్మిదేళ్ళ అరాచక పాలనకు శరమగీతం పాడి అధికారంలోకి వచ్చి ఆరోగ్య శ్రీ ,రైతు రుణాలు మాఫీ ,స్కాలర్ షిప్స్ లాంటి పథకాలను అమలు చేసి తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో హైకమాండ్ ను ఎదిరించి మరి ఒంటరిగా బరిలోకి దిగి భారీ మెజారిటీతో గెలుపొందాడు.అది గెలుపు అంటే .అది సత్తా అంటే ..వైఎస్సార్ చరిష్మా ఉన్ననాయకుడు .ఢిల్లీను గడగడలాడించాడు.చంద్రబాబు చరిష్మా లేదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.మీకోసం వీడియో కూడా ఉంది ఒక లుక్ వేయండి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat