టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టారు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడానికే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపడుతున్నారని, సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తేనే పరిష్కారమవుతాయని, కానీ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా అడ్డుపడుతున్నారన్నారు. ఇలా జగన్ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు.
see also : అవును, అందుకు కారణం జగనే..!!
see also : 2019లో జగన్ సీఎం అవడం ఖాయం..! కారణాలు చెప్పిన నటుడు శివాజీ..!!
తనపై ఉన్న కేసులను కొట్టివేయించుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మోడీ కాళ్లు పట్టుకోవడం జగన్‌కే చెల్లిందన్నారు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర రోల్ ప్లే చేసే దమ్ము వైఎస్ జగన్‌కు లేదన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేసి 17నెలలు జైల్లో ఉండి, 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి, ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లేటటువంటినేర పూరిత చర్యల వల్ల వైఎస్ జగన్ పేరు ఏపీ, దేశంలోని కొంతమందికి తెలిసిందన్నారు. అటువంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించడానికి అర్హుడు కాదని అన్నారు.