క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని ప్రకటించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌కే షాకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా తను భిన్నమైన రాజకీయాలు చేస్తానని ప్రకటించిన పవన్..దానికి భిన్నంగా ఇతర పార్టీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఏకంగా తన అభిమానులకు సైతం షాకిచ్చేలా ఆయన వ్యవహరించారని చర్చ జరుగుతోంది.
see also :వైసీపీలోకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ ..!
see also :వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..!
ఓ సీనియర్ నేతకు వెల్‌కం చెప్పడమే కాకుండా ఆయన పరా్టీలో చేరిన క్షణాల వ్యవధిలోనే కీలక బాధ్యతలు అప్పగించి ఫ్యాన్స్ అవాక్కయ్యేలా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం కాంగ్రెస్ నుంచి జనసేనలో చేరారు. ఆయనకు స్వాగతం పలికిన జనసేనాని కీలకమైన బాధ్యతలు అప్పగించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభ పర్యవేక్షణ బాధ్యతల్ని మాదాసు గంగాధరం గారికి అప్పగించామని ప్రకటించారు. పార్టీ నేతలు సైతం ఈ ఎంపికపట్ల అవాక్కవుతుండటం గమనార్హం.
see also : వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.