వ్యవస్థను, మీడియాని మేనేజ్ చేయటంలో, కుఠిల రాజకీయాలు చేయడంలో చంద్రబాబుది అందవేసిన చేయి. అందులో బాబుగారిని కొట్టేవాడు లేడని అంటారు రాజకీయ పండితులు, ఆయన గురించి తెలిసిన సన్నిహితులు. అయితే ఈ మధ్య చంద్రబాబు ట్రాక్ తప్పుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు తన మాటల చాణుక్యతను ఏపీ ప్రజలు హక్కుగా భావించే ప్రత్యేక హోదాపైనా చూపించారు. తనమీద ఉన్న ఓటుకు నోటు కేసు సహా అన్ని కేసులను కొట్టివేయించుకునేందుక ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టుపెట్టి మరీ కేంద్ర మంత్రుల వద్ద సాగిలపడ్డారు.
see also : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ట్విస్టు..!
అయితే, 2014 ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యతను తీసుకుంటానని చెప్పి, కేంద్రంతో పోరాడి మరీ ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన చంద్రబాబు తీరా మోసపూరిత హామీలతో అధికారం చేపట్టాక తన స్టాండ్‌ను మార్చారు. కారణం ఓటుకు నోటు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు ప్రత్యేక హోదాపై తన స్టాండ్‌ను తెలియజేస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
see also : వైసీపీలోకి 40ఏళ్ళ సీనియర్ రాజకీయ నేత..!
1) 2014 ఎన్నికల అనంతరం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాలో ఏముంది..? ప్రత్యేక హోదాతో పోలిస్తే.. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వచ్చే ఫలాలే ఎక్కువ. అసలు రెండింటి మధ్య వ్యత్యాసం ఎక్కడుందో చెప్పండి అంటూ విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంటూ ప్రజలను ప్రతిపక్షం మోసం చేస్తుందన్నారు.
see also : ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క జగన్‌కే ఉంది..! టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు ..!!
2) యువతకు ఉద్యోగాలు రావడం లేదు…. స్పెషల్ స్టేటస్ ఇస్తేనే ఉద్యోగాలు వస్తాయి.. అంటూ ప్రతిపక్షం వైఎస్ఆర్‌సీపీ ప్రత్యేక ప్యాకేజీని వక్రీకరిస్తోందని. ప్రతిపక్ష సభ్యులకు ఏం అనుభవం ఉండి ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
3) స్పెషల్ స్టేటస్ లో ఉన్న ఫలితాలనే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఏపీకి కల్పిస్తామన్నారు. వారు చెప్పిన ప్రత్యేక ప్యాకేజీ కిందనే సెంట్రల్ స్పాన్సెస్ స్కీమ్స్ కానీ, ఈఏపీ కాని ఇవ్వమని అడుగుతున్నానంటూ చంద్రబాబు నాయుడు విలేకరులతో చెప్పారు.
see also : వైఎస్ జగన్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన ఎమ్మెల్యే అనిత..!!
4) ఓన్లీ స్పెషల్ స్టేటస్ వస్తే ఏమొస్తుందండీ.. వస్తే రూ.15వేల కోట్లు వస్తుంది. ఈఏపీ కింద మరో రూ.16వేల కోట్లు వస్తుంది. అంతే, ప్రతిపక్ష వైసీపీ మేం రాజీనామా చేస్తాం, అవిశ్వాస తీర్మాన పెడతాం అంటూ చెబుతున్నారని, అలా చేస్తే ప్రయోజనమేమీ ఉండదంటూ.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు చంద్రబాబు నాయుడు.
ఇలా.. నాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడవడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మంజూరు చేసిన అరాకొరా నిధుల్లో కమీషన్లు దండుకొంటూ, ఆ నిధులతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొంటూ, ఆఖరికి ఓటు కోసం కోట్లు ఆశచూపి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్షంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.