వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను తుంగలో తొక్కిన కేంద్రంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మీద ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అవిశ్వాస తీర్మానం పెడతామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే.
see also :వైసీపీలోకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ ..!
అయితే ఈ అంశం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు వేశారు.ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద తొలుత అవిశ్వాసం పెట్టదలచిన ఇరవై ఒకటో తేదిన కాకుండా సోమవారం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
see also :వైఎస్సార్ చరిష్మా ఉన్నోడు.ఢిల్లీని గడగడలాడించాడు..ఆయన ముందు బాబు ఎంత?
అయితే టీడీపీ పార్టీ ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టమంటే అప్పుడు పెట్టడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధమే .మరి టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తుందా అని ఆయన బాబును ప్రశ్నించారు.అంతే కాకుండా అవిశ్వాస తీర్మానం తర్వాత తమ పార్టీకి చెందిన ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని ఆయన మీడియాకు తెలిపారు.
see also :అకౌంట్ లో రూ 50 ఉంటే చాలు..బ్యాంక్ ఖాతా దారులకు శుభవార్త..!