కాంగ్రెస్ పార్టీ గతంలో 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయింది… టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ యే అధికారంలోకి వస్తుందన్నారు.రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్మే పరిస్థితి లేదన్నారు.టీఆర్ఎస్ పార్టీ హయంలో ప్రజలందరు సంతోషంగా ఉన్నారన్నారు.
SEE ALSO :పార్టీ మార్పుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..!
కాంగ్రెస్ నాయకులూ విశ్వసనియతను కోల్పోయారని…గతంలో ప్రజలు మంచినీటి కోసం ధర్నా చేసేవారు..కాని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నామన్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ మనిషికి 4 కిలోల రేషన్ బియ్యం ఇస్తే..మేం ఎలాంటి సీలింగ్ లేకుండా మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నామన్నారు.ఎన్నికలప్పుడు ప్రకటించిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు.ఎవ్వరు అడగకున్న హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నామని చెప్పారు.