తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలబై మంది ఎమ్మెల్యేలతో సహా బీజేపీ పార్టీలోకి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.పార్టీ మారుతున్నట్లు తనపై వస్తున్న వార్తలకు మంత్రి హరీష్ రావు స్పందించారు.
See Also:ఎంపీ పదవికి రాజీనామా-టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ట్విస్టు..!
ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తను పార్టీ మారుతున్నట్లు వస్తున్నా వార్తల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు.నాకు ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ గారి మాటే నాకు బాట.నేను పార్టీలో ఒక కార్యకర్తను.
See Also:వైసీపీలోకి 40 ఏళ్ళ సీనియర్ రాజకీయ నేత..!
నాపుట్టుక టీఆర్ఎస్ లోనే ..నా చావు టీఆర్ఎస్ లోనే ..తనపై విషప్రచారం చేస్తున్న వారిపై చట్టపర చర్యలను తీసుకుంటాం.ఇదే అంశం మీద రాష్ట్ర డీజీపీ మహేంద్ర రెడ్డికి అదేశాలిచ్చాం అని మంత్రి హరీష్ రావు కుండ బద్దలు కొట్టినట్లు తనపై వస్తున్నా పుకార్లకు తెర దించారు..
See Also:బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ వైస్ ఛాన్సిలర్…!