ప్రస్తుతం ఎక్కడ చుసిన ATM బోర్డులు ATM OUT OF SERVICE లేదా NO CASH బోర్డులతో దర్శనమిస్తున్నాయి.బ్యాంకుల అడ్డగోలు నిబంధనలతో ఖాతాదారులు విసిగిపోయారు.కాని ఇప్పటినుండి మీకు ఆ బాధలు ఉండబోవని..మీకోసం మేమున్నాం అని పోస్ట్ ఆఫీసులు ఆపన్న హస్తం అందిస్తున్నాయి.
SEE ALSO :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
కేవలం 100/- రూపాయలతో పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరిచి…బ్యాంకుల నుండి ఉపశమనం పొందండి అంటూ అభ్యమిస్తున్నాయి.ఇటీవల అమల్లోకి వచ్చిన బ్యాంక్ నిబంధనల ప్రకారం బ్యాంక్ ఖాతాదారులు కనీస నిల్వ 5000/- ఉండాలని ఒక షరతు పెట్టింది.దీంతో బ్యాంక్ ఖాతాదారులు ఖంగు తిన్నారు. అంతేకాకుండా ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకుంటే ప్రతీ నెల బాదుడు కూడా షురు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో
SEE ALSO :బిర్యాని ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలా..?
పోస్ట్ ఆఫీస్ లో ఎటువంటి నిబంధనలు లేకుండా కేవలం 100 రూపాయలతో ఖాతా తెరిచే పద్ధతి అమల్లోకి తిసుకవచ్చింది.అంతేకాకుండా కనీస నిల్వ 50 రూపాయలుగా నిర్ణయి౦చింది .అలాగే అదనపు చార్జీలు కూడా ఏమీ వసూలు చేయం అని తెలిపింది.అయితే పోస్ట్ ఆఫీస్ లో పూర్తి మొత్తంలో నిబంధనలు లేకపోయినప్పటికీ సదరు ఖాతాదారుడు తనఖాతాలో గరిష్ట నిల్వ కల్పించే వెసులుబాటు కల్పించడంతో ప్రజలు పెద్ద మొత్తంలో ఖాతాలు తెరువడం మొదలు పెట్టారు.