భారతదేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ స్పందించారు.
SEE ALSO :ఏరో స్పేస్ లో తెలంగాణ దూసుకెళ్తోంది.. మంత్రి కేటీఆర్
ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…మన దేశంలో అనేక పార్టీలు ఉన్నాయని, మనది రెండు పార్టీల ప్రజాస్వామ్యం కాదని, ప్రాంతీయ పార్టీలు కూడా మన దేశంలో బలంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.
SEE ALSO :మంత్రి కేటీఆర్ కోరికతో ఆశ్చర్యపోయిన కుటుంబం..!
సీఎం కేసీఆర్ గారు చెప్పినట్లుగా.. భారతదేశ ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకుచాలా సార్లు అవకాశాలు ఇచ్చారన్నారు.. కానీ ఆ పార్టీలు దేశప్రజల ఆశయాలను,అవసరాలను తీర్చలేకపోయాయన్నారు.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు థర్డ్ ఫ్రంట్‌కు మంచి అవకాశం ఉందని, లేదంటే థర్డ్ ఫ్రంటే ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
SEE ALSO : టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూటర్న్