బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్ల వివాహం..!! బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్, జబర్దస్త్ కమెడియన్ సుధీర్ల వివాహం అతిరధమహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు, కమెడియన్లు హాజరయ్యారు. అయితే, వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువురి కుటుంబ పెద్దల నిర్ణయంతో రష్మీ, సుధీర్‌లు పెళ్లితో ఒక్కటయ్యారు.
see also : బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!!
అవునా..! రష్మీ, సుధీర్‌లు పెళ్లి చేసుకున్నారా..! నిజమేనా..!! అవును, రష్మీ, సుధీర్‌లు పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరు పెళ్లిచేసుకున్నది నిజజీవితంలో కాదు. బుల్లితెరపై. ఇక అసలు విషయానికొస్తే.. బుల్లితెరపై మాంచి రేటింగ్‌తో దూసుకుపోతున్న జబర్దస్త్, ఢీ ప్రోగ్రామ్ టీమ్‌లు కలిసి వీరిద్దరిపెళ్లిని దగ్గరుండి చేశారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోలో రష్మీ, సుదీర్లు అచ్చం కాబోయే వధూవరులలానే అందరికీ పెళ్లికార్డులు ఇవ్వడం, ఆ తరువాత పెళ్లిబట్టలతో వేదికపై కూర్చోవడం, సుధీర్ రష్మీ మెడలో తాళి కడుతుండగా.. రష్మీ సిగ్గుపడటడం ఇలా… ప్రోమో ఆద్యాంతం.. రష్మీ, సుధీర్‌లు భార్యాభర్తలుగానే కనిపించారు. ఈ ప్రోగ్రామ్ తెలుగువారి పండుగ ఉగాది రోజున బుల్లితెరపై ప్రసారం కాబోతుంది.
see also : అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామా..ప్రధానమంత్రికి సమర్పణ