తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, యువనేత కేటీఆర్ ఆపదలో ఉన్నవారి పట్ల ఎంత వేగంగా, ఉదారంగా స్పందిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంటల తరబడి నిరీక్షణలు, అపాయింట్‌మెంట్లు వంటి ఫార్మాలిటీలకు మంత్రి కేటీఆర్ దూరం. కేవలం ఓ ట్వీట్ ద్వారా తమ సమస్యను చెప్పుకొంటే చాలు..మంత్రి కేటీఆర్ తన వల్ల అయ్యే సహాయం చేస్తారు. అలా సహాయం చేసి ఓ చిన్నారికి ప్రాణం పోసిన మంత్రి..ఆశ్చర్యకరమైన కోరికను కోరారు!
see also :ఏరో స్పేస్ లో తెలంగాణ దూసుకెళ్తోంది.. మంత్రి కేటీఆర్
ఇంతకీ ఏం జరిగిందంటే…నిఖిల్ అనే ఓ చిన్నారి తీవ్రమైన ఆరోగ్యసమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన చికిత్సకు భారీగా ఖర్చు అవుతుండటం… ఆ కుటుంబం అంత భరించే పరిస్థితుల్లో లేకపోవడంతో….మంత్రి కేటీఆర్‌ను సంప్రదించారు. ట్వీట్ ద్వారా ఆయనకు విషయాన్ని చేరవేశారు. దీంతో వెంటనే సంప్రదించిన మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి సహాయనిధి రూ.7 లక్షలు మంజూరు చేయించారు. ఆ మొత్తాన్ని అందించడం ద్వారా ఆ చిన్నారికి ప్రాణాపాయం దక్కింది.
see also :నేను రెడీ….మీరు రెడీనా..? వైఎస్ జగన్
ఈ సంతోషకరమైన కబురును మంత్రి కేటీఆర్‌కు నిశాంత్ అనే నెటిజిన్ తెలియజేశారు. ` మాటలు, చేతల్లో చిత్తశుద్ధి ఉంచే నాయకుడికి తీరుకు ఇదే నిదర్శనం. చికిత్సకు కావాల్సిన పూర్తి మొత్తాన్ని మీరు అందిస్తారని ఆ కుటుంబం అనుకోలేదు. అంత మొత్తం కేటాయించి ఆ బుజ్జాయిని కాపాడిన మీకు ధన్యవాదాలు. త్వరలోనే ఆ ఐదేళ్ల చిన్నారి మాట్లాడుతారు. వినగలుగుతారు. మీకు ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు` అని తెలిపారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ…`చాలా సంతోషం. ఆ చిన్నారి మాట్లాడినపుడు వినాలని ఉంది. అప్పుడు తప్పకుండా నాకు సమాచారం అందించు` అంటూ తనదైన శైలిలో స్పందించారు.
see also :జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు-వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టే వార్త..!
Thanks Nishant. Glad I could be of help but would be happier when you let me know when the child can listen & speak ? https://t.co/20sHavzXgE
— KTR (@KTRTRS) March 7, 2018